Breaking News

వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: హైకోర్టు ఆదేశాలు

Published on Fri, 08/18/2023 - 08:16

సాక్షి, హైదరాబాద్‌: వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకో వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. గత నెల వరదలపై అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 22వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని స్పష్టం చేసింది. 

అయితే, ఇటీవలి వరద కారణంగా మోరంచపల్లెలో మృతి చెందిన మహాలక్ష్మి, సంజీవయ్య పేర్లను ప్రభుత్వం జాబితాలో చేర్చలేదని పిటిషనర్‌ పేర్కొనగా, ఈ ఇద్దరు కూడా వరద కారణంగానే మృతి చెందితే, వారి వివరాలనూ అఫిడవిట్‌లో వెల్లడించాలని చెప్పింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ 2020లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)లో న్యాయ వాది చిక్కుడు ప్రభాకర్‌ మధ్యంతర అప్లికేషన్‌ (ఐఏ) దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ ఐఏపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం గరువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ నెల 18 నుంచి 22 వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చర్యలు చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని చిక్కుడు ప్రభాకర్‌ కోరారు.   

ఇది కూడా చదవండి: రైతు బంధు పక్కదారి!

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)