Breaking News

TG: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలు.. స్థానికతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Published on Thu, 09/05/2024 - 15:56

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులేనని సీజే ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 

ఇదే సమయంలో స్థానికులు ఎవరు అనే అంశంపై సరైన మార్గదర్శకాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులు ఎవరనే విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రూపొందించిన మార్గ నిర్దేశకాల ప్రకారం కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు సూచించింది. 

కాగా, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సు ప్రవేశాల్లో స్థానికత జీవోకు సంబంధించి నేడు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక, జీవోలో భాగంగా నీట్‌ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్ధమంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)