Breaking News

ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినచర్యలు

Published on Wed, 06/12/2024 - 06:13

సాక్షి, హైదరాబాద్‌: ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవ హరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడుల్లో అనేక హోటళ్లలో నాసిరకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడటంతో దానిపై మంత్రి ఆరా తీశారు. మంగళవారం సచివాలయంలో అధి కారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, హైదరాబాద్‌ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాపారవేత్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుడ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతున్నామని, హోటల్‌ యాజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

ప్రతి 6 నెలలకు వర్క్‌షాపు నిర్వహణ, అవగాహన సద స్సు నిర్వహిస్తామని, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హోటల్స్‌ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఆర్‌ వీ కర్ణన్, డైరెక్టర్‌ ఫుడ్‌ సేఫ్టీ డాక్టర్‌ శివలీల, తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌రెడ్డి, ఇండియన్‌ రెస్టారెంట్స్‌ అసోసియేష న్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)