Breaking News

‘ధిక్కరణ’ వేయండి.. చర్యలు తీసుకుంటాం

Published on Sat, 09/09/2023 - 04:01

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌(పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్న ఆధారాలుంటే...ధిక్కరణ పిటిషన్‌ వేయాలని న్యాయవాది వేణుమాధవ్‌ను హైకోర్టు ఆదేశించింది. సరైన ఆధారాలతో పిటిషన్‌ వేస్తే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కొలనుల్లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని పేర్కొంది.

తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. పీఓపీతో తయారు చేసే విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ ధూళ్‌పేటకు చెందిన తెలంగాణ గణేశ్‌మూర్తి కళాకా రుల సంక్షేమ సంఘంతో పాటు మరికొందరు హైకోర్టు లో 2022లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.

ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ హరేందర్‌ పరిషద్‌ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయలేదని, తాత్కాలిక కొలనుల్లో చేశామని తెలిపారు. ఈ క్రమంలో న్యాయవాది వేణుమాధవ్‌ వాదిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆధారాలతో పిటిషన్‌ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, విచారణను వాయిదా వేసింది.  

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు