Breaking News

కృష్ణాలో 382.48 టీఎంసీల అదనపు అవసరాలు

Published on Mon, 09/22/2025 - 05:57

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలకు 382.48 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వినియోగంలోకి తీసుకురావడానికి 16 కొత్త ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పున:పంపిణీపై జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2 ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్న విచారణ సందర్భంగా భవిష్యత్‌లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులకు మొత్తం 382.48 టీఎంసీల నీటి కేటాయింపులు జరపాలని వాదనలు వినిపించనుంది. ఇందులో భాగంగా ఆయా ప్రాజెక్టులకు ఇన్వెస్టిగేషన్లు, సర్వేలు నిర్వహించాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా ఏపీ భారీగా కృష్ణా జలాలను తరలించి జలాశయాల్లో నిల్వ చేసుకుంటుండగా, తెలంగాణలో మాత్రం రాష్ట్ర అవసరాలకు సరిపడా కృష్ణా జలాలను నిల్వ చేసుకోవడానికి జలాశయాలు లేవని చాలాకాలంగా ఆందోళనలున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు నిల్వ సామర్థ్యం పెంచుకొని కృష్ణా మిగులు జలాలను వాడుకోవడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రిజర్వాయర్ల నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందింది. దీని ఆధారంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 16 కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

జూరాల నుంచి 227టీఎంసీల తరలింపు..
227 టీఎంసీలను జూరాల ప్రాజెక్టు, 55 టీఎంసీలను శ్రీశైలం జలాశయం నుంచి తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వరదల సమయంలో జూరాల రిజర్వాయర్‌ నుంచి రోజుకు 2 టీఎంసీలు చొప్పున మొత్తం 100 టీఎంసీలను తరలించుకోవడానికి జూరాల ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ నిర్మించి ఇతర రిజర్వాయర్లు, చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని 11.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ప్రతిపాదించింది. 

⇒ వరదల సమయంలో జూరాల రిజర్వాయర్‌ వెనక భాగం నుంచి మరో 123 టీఎంసీల నీటిని తరలించి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడానికి కోయిల్‌కొండ–గండీడ్‌ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 45 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కోయిల్‌కొండ, 35 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో గండీడ్, 43 టీఎంసీల సామర్థ్యంతో దౌలతాబాద్‌ రిజర్వాయర్లను నిర్మించనుంది. 

⇒  జూరాల రిజర్వాయర్‌ నుంచి మరో 4 టీఎంసీలను తరలించి అదనంగా 25వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో దశ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించింది. 

⇒ నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామంలో శ్రీశైలం జలాశయం వెనక నుంచి రోజుకు టీఎంసీ చొప్పున 35 టీఎంసీలను తరలించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.99 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందించడానికి శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పొడవు పొడిగించనున్నట్టు తెలిపింది.

⇒ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండోదశ కింద కాల్వలు, హెడ్‌వర్క్స్, పంప్‌హౌస్‌ సామర్థ్యం పెంచి శ్రీశైలం జలాశయం నుంచి 13 టీఎంసీలను తరలించి అదనంగా 95,531 ఎకరాల ఆయకట్టుకు సాగునీరుతో పాటు 7.12 టీఎంసీల తాగునీటి సరఫరా చేయనున్నట్టు పేర్కొంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)