Telangana: మందు ఖర్చులో మనమే టాప్‌

Published on Tue, 08/27/2024 - 12:23

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పెళ్లి అయినా, చావు అయినా... సందర్భమేదైనా... పది మంది కూడారంటే ఒకటి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అదేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మీకు అర్థమయినా కాకపోయినా, మీరు ఊహించినా లేకున్నా దానిపేరు మద్యం. ఈ మద్యం కిక్కు లేకుండా మన దగ్గర ఏ సంబురం నడవదంటే అతిశయోక్తి కాదు. 

అందుకేనేమో దేశంలోకెల్లా అత్యంత ఎక్కువ తలసరి మద్యం ఖర్చు మన రాష్ట్రంలోనే నమోదయింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం మీద తలసరి ఖర్చు బాగానే నమోదైంది. తెలంగాణ తలసరి ఖర్చు రూ. 1,623 కాగా, ఏపీలో అది రూ.1,306గా నమోదైంది. 

అయితే, 2016–17తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఖర్చు తగ్గిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2016–17లో ఏపీలో సగటు మనిషి ఏడాదికి రూ. 1,324 మద్యం మీద వెచ్చిస్తే, 2022–23 వచ్చేసరి కి అది రూ.1,306కి తగ్గడం గమనార్హం. ఇక, కరోనా సమయంలో అయితే తెలంగాణలో అత్యధి క సగటు ఖర్చు నమోదైంది. 2020–21లో ఏకంగా రూ.1,719 తలసరి ఖర్చు వచ్చిందని అధ్యయన గణాంకాలు చెబుతున్నాయి. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలకు తోడుగా రూ. 1,000 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)