Breaking News

సీడీఎంఏగా శ్రీదేవి.. హరీశ్‌కు ఐఅండ్‌పీఆర్‌

Published on Tue, 10/29/2024 - 06:23

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రస్థాయి కమిషనర్లు, డైరె క్టర్లు, జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు ఈ జాబి తాలో ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌ అధికా రులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌ టి.కె. శ్రీదేవిని మళ్లీ పుర పాలక శాఖకు పంపారు. ఆమెను కమిషనర్‌ అండ్‌ డైరె క్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ)గా బదిలీ చేస్తు న్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్‌పీఆర్‌) స్పెషల్‌ కమిషనర్‌గా ఉన్న ఎం. హనుమంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ఐఅండ్‌పీఆర్‌ బాధ్యతలను రెవెన్యూ జాయింట్‌ సెక్ర టరీ ఎస్‌.హరీశ్‌కు అప్పగించారు. ఆయనను ఐఅండ్‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా బది లీ చేసినప్పటికీ రెవెన్యూ శాఖ జాయింట్‌ సెక్రటరీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశాంకకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. కాగా సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులైన ఎస్‌.హరీశ్‌ సోమవారం ఆన్‌లైన్‌లో బాధ్యతలు స్వీకరించారు.  


(వీరితో పాటు టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తికి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా, హాకా ఎండీ కె. చంద్రశేఖర్‌రెడ్డికి పాడి అభివృద్ధి సమాఖ్య ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఎండీగా ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి సోని బాలాదేవిని డైరెక్టర్, స్పోర్ట్స్, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఎండీగా పునర్నియమించారు. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జెడ్పీ సీఈవోగా ఉన్న ఎస్‌.దిలీప్‌కుమార్‌ను నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. రాజన్న సర్కిల్‌లో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌గా ఉన్న అటవీశాఖ అధికారి జి.జ్ఞానేశ్వర్‌ను వికారాబాద్‌ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)గా నియమించారు.)      

#

Tags : 1

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)