Breaking News

సారొస్తారు.. ఆటోలో తెస్తారు..

Published on Tue, 07/08/2025 - 09:18

నల్గొండ జిల్లా: బడికి రాని పిల్లలను బడికి రప్పించే విషయంలో ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసలు అందుకుంటున్నా యి. నల్లగొండ జిల్లాలో ఓ ఉపాధ్యా యుడు బడికి రాని విద్యార్థులను వారింటికి వెళ్లి మరీ బడికి తీసుకొ స్తుంటే.. మరో ఉపాధ్యాయుడు పిల్లల కోసం అద్దెకు తీసుకుని ఆటో ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కాశవారిగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం 13 మంది విద్యార్థులు చేరారు. అయితే, కొందరు విద్యార్థులు పాఠశా లకు సక్రమంగా రాకుండా ఇంటి వద్దే ఉంటుంటారు. దీంతో ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉమాశంకర్‌గౌడ్, జాన్‌రెడ్డి విద్యార్థుల ఇంటికి వెళ్లి తమ బైక్‌పై ఎక్కించుకొని పాఠశాలకు తీసుకొచ్చి పాఠాలు బోధిస్తున్నారు. 

దాత సాయంతో ఆటో తెచ్చి...
వరంగల్‌ జిల్లా నెక్కొండలోని హైస్కూల్‌కు పిల్లలను పంపాలని ఉపాధ్యాయులు సమీ పంలోని గుండ్రపల్లి, మడిపల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పదిమంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశా లకు పంపేందుకు ఒప్పుకున్న తల్లిదండ్రులు.. రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఆ పాఠశాల ఉపాధ్యా యుడు వంగర లక్ష్మణ్‌ విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కిరణ్‌ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన ప్రతినెలా ఆటోవాలాకు రూ.6,500 చెల్లించేలా ఒప్పుకున్నాడు. దీంతో సోమవారం పిల్లలు ఆటోలో స్కూల్‌కు వచ్చారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)