Breaking News

ఎఫ్‌టీఎల్‌ సమీప సర్వే నంబర్లివ్వండి

Published on Wed, 02/26/2025 - 03:46

సాక్షి, హైదరాబాద్‌: చెరువులు, కుంటల పూర్తి నీటిమట్టం స్థాయి (ఎఫ్‌టీఎల్‌) నుంచి 200 మీటర్ల లోపు ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలతోపాటు ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న సర్వే నంబర్లను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌కు పంపాలని వివిధ శాఖలు, సంస్థల అధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్‌ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వీసీలు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, డీటీసీపీలు తమ పరిధిలోని నీటి వనరుల ఎఫ్‌టీఎల్‌ నుంచి 200 మీటర్ల లోపు ఉన్న సర్వే నంబర్లను పంపించాల్సి ఉంటుందని పేర్కొంది. 

ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న భూముల సర్వే నంబర్లలో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ శాఖల పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీకి పంపుతారు. డీటీసీపీ ఈ ప్రక్రియను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.  

ఇదీ ప్రక్రియ.. 
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ఫీజుల చెల్లింపు ప్రక్రియ జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌తో రిజిస్ట్రేషన్‌ల శాఖ సర్వర్‌ను అనుసంధానం చేస్తోంది. ఈ అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీజీజీకి సర్వే నంబర్ల వివరాలను అందిస్తే, ఆన్‌లైన్‌లో వాటిని అందుబాటులో ఉంచనుంది. తదనుగుణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను మున్సిపల్‌ లేదా పంచాయతీ రాజ్‌ , నీటిపారుదల, రెవెన్యూ శాఖలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి.  

⇒ ఆ తర్వాత ఆన్‌లైన్‌లోనే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నిర్ణయించబడుతుంది.  
⇒ ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, గతంలో చెల్లించిన మొత్తం ఫీజు నుంచి 10 శాతం ప్రాసెసింగ్‌ చార్జీలను మినహాయించుకుంటారు.  
⇒ వెంచర్‌లోని 10 శాతం ప్లాట్లను 2020 ఆగస్టు 26కు ముందు విక్రయించి ఉంటే, మిగతా ప్లాట్ల క్రమబధ్ధీకరణ కోసం.. విక్రయించిన ప్లాట్ల వివరాలను ఈసీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.  

⇒ లేఅవుట్‌ క్రమబధ్ధీకరణ చార్జీలు, ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు చెల్లించిన తర్వాత తాత్కాలిక ఫీజు నిర్ణయమవుతుందని ప్రభుత్వం తెలిపింది.  
⇒ సబ్‌–రిజి్రస్టార్‌ సంబంధిత ప్లాట్‌ను నమోదు చేసి, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు వివరాలు, సేకరించిన చార్జీలను ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌కు ప్రాసెసింగ్‌ కోసం పంపితే క్రమబధ్ధీకరణ చార్జీలు ఆన్‌లైన్‌లోనే నిర్ణయమవుతాయి.    

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)