Breaking News

రిజర్వేషన్ల ఖరారు ఇలా..

Published on Sat, 09/27/2025 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టానికి చేసిన సవరణలకు అనుగుణంగా..జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీల వారీగా జెడ్పీపీ, ఎంపీపీ పదవులు, స్థానాలు, సర్పంచ్‌ పదవులు, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్ల ఖరారు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పీఆర్‌ఆర్‌డీ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ శుక్రవారం రెండు జీవోలను (ఒకటి మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు, రెండోది గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం) విడుదల చేశారు.

ఈ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లు (జిల్లా ఎన్నికల అధికారులు) హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు మినహా) అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  

మహిళలకు 50 శాతం సీట్లు: శనివారం ఉదయం 11 గంటల లోగా ఎస్టీ,ఎస్సీ,బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసి సిద్ధంగా పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్లను పీఆర్‌ఆర్‌డీ డైరెక్డర్‌ సృజన ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వ్‌ చేసేందుకు లాటరీ పద్ధతిని అనుసరించనున్నారు. శనివారం ఉదయం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. మహిళల రిజర్వేషన్లు పూర్తికాగానే జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్‌ను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 

జిల్లా, మండల పరిషత్‌లలో ఇలా..: 2018 పంచాయతీరాజ్‌ చట్టానికి అనుగుణంగా...2019లో జరిగిన మొదటి ఎన్నికల తర్వాత రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లు చేయాల్సి ఉన్నందున, ఆ తర్వాత జరిగే ఎన్నికలను రెండో సాధారణ ఎన్నికలుగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే 2019 ఎన్నికల తర్వాత కొత్తగా నోటిఫై అయిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు, జెడ్పీపీలకు జరిగేవి మొదటి ఎన్నికలుగానే పరిగణిస్తారు. అందువల్ల గతంలో వీటికి చేసిన రిజర్వేషన్లను విడిచిపెట్టి, కొత్తగా చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ బీసీ సంక్షేమశాఖ జారీ చేసిన జీవోకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని, గతంలోని(2019లోని) మార్గదర్శకాల స్థానంలో ఇప్పుడు జారీచేసిన వాటిని పరిగణనలోకి తీసుకుని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించారు 

తొలుత ఎస్సీ, ఎస్టీ, బీసీ..: రిజర్వేషన్ల ఖరారులో భాగంగా ముందుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ తర్వాత మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయాలి. షెడ్యూల్డ్‌ ఏరియాల్లోని ఎంపీపీ సీట్లలో ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వ్‌ చేయాలి. ఆ మండలంలోని మొత్తం ఎంపీటీసీ సీట్లలో ఎస్టీలకు సగం కంటే ఎక్కువ స్థానాలను రిజర్వ్‌ చేయాలి. ఈ ఏరియాల్లో ఎంపీపీ అధ్యక్షుల పదవులన్నీ ఎస్టీలకే రిజర్వ్‌ చేయాలి. 

డెడికేటెడ్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే.. 
డెడికేటెడ్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే ఎంపీటీసీస్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు చేపడతారు. ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే ప్రతి కేటగిరీలో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఆర్డీవోలు ప్రతి మండల ప్రజాపరిషత్‌లోని ఎస్టీ, ఎస్సీ, బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఆయా స్థానాలకు రిజర్వేషన్‌ చేయాలి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎస్టీ (మహిళ), ఎస్సీ, బీసీ (మహిళ), అన్‌ రిజర్వ్‌డ్‌ (మహిళ)గా సెపరేట్‌ కేటగిరీలుగా చేయాలి జెడ్పీపీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్‌ను పీఆర్‌ కమిషనర్‌ ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీల వారీగా ఖరారు చేస్తారు 

గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఇలా..: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వార్డు సభ్యులకు, సర్పంచ్‌ పదవులకు ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు కులగణన (ఎస్‌ఈఈఈపీసీ)–2024 సర్వే ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. వార్డు సభ్యుల స్థానాలను (ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీలకు) ఎంపీడీవోలు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అయితే గతానికి భిన్నంగా డెడికేటెడ్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులకు అనుగుణంగానే రిజర్వేషన్లు చేపట్టాలని ఈ ఉత్వర్వుల్లో స్పష్టం చేశారు.

ప్రతి కేటగిరీలో సీట్ల రిజర్వేషన్‌ను కమిషన్‌ సూచనల ప్రకారమే చేయాలి. వార్డుల్లో ఎస్సీ, ఎస్జీ, బీసీ, మహిళా కేటగిరీలకు సంబంధించిన రిజర్వేషన్లను వీలైనంత మేర రొటేషన్‌ పద్ధతిలో చేయాలి. ఎంపీడీవోలు సంబంధిత వార్డులలో ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వ్‌ చేయాలి. కులగణన (ఎస్‌ఈఈఈపీసీ)–2024 సర్వేకు అనుగుణంగా ప్రతి గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ప్రతి కేటగిరీ (ఎస్టీ, ఎస్సీ, బీసీ) జనాభాను డిసెండింగ్‌ ఆర్డర్‌లో పెట్టి విడిగా స్టేట్‌మెంట్లు సిద్ధం చేయాలి.

దీనికి అనుగుణంగా మొదట ఎస్టీ (డిసెండింగ్‌ ఆర్డర్‌లో) 2019 మొదటి ఎలక్షన్‌లో కేటాయించిన సీట్లను మినహాయించి, మిగతా వార్టులను ఎస్టీలకు రిజర్వ్‌ చేసే విషయం పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ, బీసీ కేటగిరీల్లోనూ గతంలో (మొదటి ఎన్నికల్లో) చేసిన రిజర్వేషన్లను మినహాయించి మిగతా వాటి నుంచి రిజర్వేషన్లు ఖరారు చేయా లి. ఈ కేటగిరీల రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యాక మిగిలి పోయిన వాటిని అన్‌ రిజర్వ్‌డ్‌గా పరిగణించాలి. ఇక ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఆన్‌ రిజర్వ్‌డ్‌లకు రిజర్వ్‌ చేసిన సీట్లను అన్ని కేటగిరీల్లో 50 శాతం మహిళలకు కేటాయించేందుకు లాటరీ పద్ధతిని అనుసరించాలి.

సర్పంచ్‌ పదవికి ఇలా.. 
ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీల్లో సర్పంచ్‌ పదవుల రిజర్వేషన్‌ ఖరారు బాధ్యత ఆర్డీవోలకు అప్పగించారు. డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగానే రిజర్వేషన్లు చేపట్టాలి. ఆ మేరకే ప్రతి కేటగిరీలో ఆయా పదవులను రిజర్వ్‌ చేయాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్‌ చేసే పోస్టులకు సాధ్యమైనంత మేర రొటేషన్‌ పద్ధతిని (2019 మొదటి ఎన్నికలకు అనుగుణంగా) అనుసరించాలి. మహిళలకు సంబంధించి ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలను ప్రత్యేక కేటగిరీలుగానే పరిగణించి రిజర్వేషన్లు కేటాయించాలి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను ఎస్టీలకే రిజర్వ్‌ చేయాలి. ప్రతి మండల పరిషత్‌లో సర్పంచ్‌ పదవులను ఆర్డీవోలు కేటాయిస్తారు.   

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు