Breaking News

అద్దె బకాయిలెన్ని?

Published on Mon, 10/27/2025 - 02:34

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల అద్దె బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రతి నెలా సంక్షేమ శాఖలకు రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను అటు గురుకుల విద్యా సంస్థల నిర్వహణకు, ఇటు సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, హాస్టళ్ల నిర్వహణ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల కు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. సీఎం ఇచి్చన హామీలో భాగంగా ఈమేరకు వచ్చే నెలలో రూ.500 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉంది.

ఈ నిధులను ప్రాధాన్యతా క్రమంలో వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా, గురుకుల విద్యా సంస్థలకు ప్రైవేటు భవనాల అద్దె భారంగా ఉంది. దాదాపు పది నెలల నుంచి అద్దె చెల్లింపులు నిలిచిపోయినట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం అద్దె బకాయిలే దాదాపు రూ.155 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ బకాయిలను ఒకే విడతలో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నెలనెలా తీర్చాలని ప్రభుత్వం సూచించడంతో ఈమేరకు సొసైటీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. 

ఐదు నెలల్లో క్లియర్‌ చేసేలా.. 
ప్రస్తుతం పేరుకుపోయిన అద్దె బకాయిలను మార్చి నెలాఖరు నాటికి ఏ విధంగా క్లియర్‌ చేయవచ్చనే అంశంపై సొసైటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం అద్దె బకాయిలు రూ.155 కోట్లు ఉండగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో రూ.70 కోట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో నెలవారీగా ఏ మేరకు విడుదల చేస్తే బకాయిలను క్లియర్‌ చేయవచ్చనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రతినెలా రూ.15 కోట్ల మేర అద్దె బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నెలవారీగా విడుదల చేసే నిధులకు అదనంగా.. గత బకాయిలను కలుపుకొంటూ చెల్లింపులు చేసేందుకు గురుకుల సొసైటీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

సొసైటీల వారీగా అద్దె భవనాల సంఖ్య, అద్దె బిల్లుల బకాయిలు, కొత్తగా చెల్లించాల్సిన మొత్తం.. తదితర అంశాలతో కూడిన ప్రతిపాదనలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గురుకుల సొసైటీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సొసైటీ అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్‌ ఆధారంగా వివరాలు సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లో ఈ వివరాలతో కూడిన ప్రతిపాదనలను సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి సమర్పిస్తామని సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా గురుకుల అద్దె భవనాల బకాయిలు దాదాపు క్లియర్‌ అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)