ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
వాహనదారులకు షాక్.. ORRపై టోల్ ఛార్జీలు పెంపు
Published on Mon, 03/31/2025 - 13:30
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓఆర్ఆర్పై వెళ్లే వాహనదారులకు బిగ్ షాక్. హైదరాబాద్ ఔటర్ రింగ్(ORR) రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచుతూ సదరు నిర్వహణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెరిగిన ధరలను నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది.
అయితే, హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్బీ సంస్థ రెండేండ్ల క్రితం 30 ఏండ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్‌ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలను పెంచింది.
కొత్త ఛార్జీలు ఇలా..
- కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచింది. దీంతో ప్రస్తుతం కిలోమీటర్‌కు రూ.2.34గా ఉన్న చార్జీలు రూ.2.44కు పెరిగాయి.
- మినీబస్, ఎల్సీవీలకు కిలోమీటర్‌కు 20 పైసలు వడ్డించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.3.77 నుంచి రూ.3.94కు చేరింది.
- రెండు యాక్సిల్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచింది.
- భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.15.09 నుంచి రూ.15.78కు పెంచింది.

#
Tags : 1