Breaking News

TS: జీసీసీలో కారుణ్య నియామకాలపై గ్రీన్‌సిగ్నల్‌

Published on Mon, 04/03/2023 - 10:36

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌(జీసీసీ)లో కారుణ్య నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కరుణించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదుల సంఖ్యలో ఉద్యోగులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. అయితే వరుసగా మూడేళ్లు లాభాలతో కొనసాగినప్పుడే కారుణ్య నియామకాలు చేపట్టాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూడేళ్ల నుంచి లాభాలు గడించినప్పటికీ కోవిడ్‌–19 కారణంగా ఆ తర్వాత నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ లాభాల బాటలో ఉంది. ఈ నేపథ్యంలో జీసీసీ కారుణ్య నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపారు. ఈ ఫైలుపై సీఎం సంతకం చేశారు. దీంతో కారుణ్య నియామకాల ఆర్జీలకు అతి త్వరలో మోక్షం కలగనుంది. 

330 మంది ఉద్యోగులతో..
తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటీవ్‌ కార్పొరేషన్‌(టీఎస్‌జీసీసీ) పరిధిలో 330 మంది ఉద్యోగులు శాశ్వత, తాత్కాలిక పద్దతిలో పనిచేస్తున్నారు. మూడు డివిజినల్‌ కార్యాలయాలు, 18 సొసైటీలు, 311 రెగ్యులర్‌ డిపోలు, 158 సబ్‌ డిపోలున్నాయి. మరో 125 స్వయం సహాయక సంఘాలతోనూ జీసీసీ అనుసంధానమై కార్యకలాపాలు సాగిస్తోంది. జీసీసీ ద్వారా తేనె, ఇప్పపువ్వు, గమ్, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులతోపాటు సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, కందిపప్పు, ఇతర ఆహార మసాలాలు, సుగంధ ద్రవ్య పొడి(పౌడర్‌)లు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలకు వంట సరుకులన్నీ దాదాపు జీసీసీ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు జీసీసీ హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్నప్పటికీ తయారీ యూనిట్లు విశాఖ కేంద్రంగా నడిచేవి. 

అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రతి యూనిట్‌ కొత్తగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో జీసీసీకి ఏటా కేటాయింపులు జరిపినప్పటికీ రాబడి అంతంత మాత్రంగా ఉండేది. ఇప్పుడు లాభాల బాటలో కార్పొరేషన్‌ ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. టీఎస్‌జీసీసీ పరిధిలో ఎనిమిదేళ్లలో 30 ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించారు. ఇందుకు సంబంధించి క్లెయిమ్స్‌ పూర్తి చేసినప్పటికీ కారుణ్య నియామకాలకు అర్హులైన వారసులు 30 మంది దరఖాస్తులు సమర్పించారు. తాజాగా వీరి దరఖాస్తులు పరిశీలించి కారుణ్య నియామకాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)