Breaking News

ముందుగా ‘పంచాయతే’..!

Published on Sun, 11/16/2025 - 04:04

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 17న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై తదుపరి విచారణ జరిగే ఈ నెల 24లోగా సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం అనివార్యంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 17న జరిగే కేబినెట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకున్న వెంటనే.. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నట్టు 18న కోర్టుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సర్కారు తెలియజేయనున్నట్టు సమాచారం.

అదీగాకుండా హైకోర్టులో కేసు కూడా గ్రామపంచాయతీ ఎన్నికలపైనే ఉండటంతో, తొలుత ఆ ఎన్నికలు నిర్వహించా లని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్ని కల నిర్వహణకు సంబంధించి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కూడా సంకేతాలిచ్చారు. కేబినెట్‌ భేటీలో పంచాయతీ ఎన్నికలపై సహచర మంత్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని, కోర్టులో ఉన్న కేసు పరిస్థితి, ప్రస్తుత పరిణామాలపై బేరీజు వేశాక నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. 

పథకాలకు ప్రజల మద్దతు 
తాజాగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ భారీ మెజారిటీతో గెలవడంతో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ప్రజలు మద్దతు తెలిపారని ప్రభుత్వపెద్దలు భావిస్తున్నారు. అందువల్ల ఈ ఊపులోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు కూడా వెళితే సానుకూల ఫలితాలు సాధించవచ్చుననే భావన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మటుకు నిధులు, అభివృద్ధి పనులు, ఇతర అవసరాల కోసం అధికారంలో ఉన్న పారీ్టకేప్రజలు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

గ్రామపంచాయతీ పాలక మండళ్ల కాలపరిమితి ముగిసి 21 నెలలు కావొస్తున్నా సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయి. అందువల్ల ఆ నిధుల కోసమైనా వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు 21 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులు విడుదలకాక పల్లెల్లో పాలన చేజారుతుండటంతో దానిని వెంటనే చక్కదిద్దాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  

ఎస్‌ఈసీ సిద్ధం 
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన వంటి రాజకీయ పరమైన నిర్ణయాలపై స్పష్టత వచ్చాక జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళితే బావుంటుందనే అభిప్రాయంతో సర్కార్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కూడా ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు హైకోర్టుకు తెలియజేసింది. స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్ల శాతం, ఎన్నికల తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన వెంటనే నిర్వహణ ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)