Breaking News

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

Published on Fri, 03/07/2025 - 10:40

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ(Dearness Allowance) ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. డీఏ ప్రకటనతో ఆర్టీసీపై ప్రతినెలా రూ.3.6 కోట్ల భారం పడుతోందన్న ఆయన.. అయినప్పటికీ ప్రభుత్వం  ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తోందని తెలిపారు. 

ఇక.. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని.. దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు తెలియజేశారాయన.  ఉద్యోగుల పై పని ఒత్తిడి పెరిగిన వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి అభినందించారు. 

ఇక.. మహిళా సమైక్య సంఘాల చేత బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు పెట్టించి మహిళలు ఆదాయాన్ని అర్జించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీ తో అద్దె ప్రాతిపదికన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో..  రేపు(మార్చి 8వ తేదీన) మహిళా దినోత్సవం సందర్భంగా  రేపు మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలతో కలిసి పొన్నం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుంది. 

పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్ ,ఖమ్మం ,కరీంనగర్ , మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్య ల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా బస్సుల డిమాండ్ ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)