Breaking News

సమీకృత గురుకులాలకు రూ. 11,000 కోట్లు

Published on Mon, 03/10/2025 - 03:58

సాక్షి, హైదరాబాద్‌: యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు (వైఐఐఆర్‌ఎస్‌)...రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు. అన్ని వర్గాల పిల్లలను ఒకే గొడుగు కిందకు తెచ్చి విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో దీనికి అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా తొలివిడత ఒకే దఫాలో 55 సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిస్తూ.. మొత్తం 55 పాఠశాలలు నిర్మించేందుకు రూ.11 వేల కోట్లు మంజూరు చేసింది.

ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకేవిడత ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం ఇదే ప్రథమం. కాగా గురుకులాల నిర్మాణానికి  సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. 

కుల, మత వైషమ్యాలు తొలగిపోయేలా.. 
    కుల, మత వైషమ్యాలు తొలగిపోవాలని, అందరికీ సమాన విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సమీకృత గురుకుల పాఠశాలల క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం నాలుగు గురుకుల పాఠశాలలుంటాయి. డిమాండ్‌కు అనుగుణంగా కొన్నిచోట్ల జనరల్‌ గురుకుల పాఠశాలలకు సైతం అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఒక్కో సమీకృత గురుకుల పాఠశాల క్యాంపస్‌ విస్తీర్ణం గరిష్టంగా 25 ఎకరాల్లో ఉంటుంది. ఈ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్‌ విద్యను అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, మినీ యాంఫీథియేటర్, క్రీడా ప్రాంగణం ఉండేలా డిజైన్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

55 నియోజకవర్గాలివే.. 
    మంచిర్యాల, హుస్నాబాద్, ఆంధోల్, వికారాబాద్, షాద్‌నగర్, కొల్లాపూర్, నల్లగొండ, వరంగల్‌ ఈస్ట్, ములుగు, ఖమ్మం, పాలేరు, అచ్చంపేట్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, భూపాలపల్లి, బోధన్, చాంద్రాయణగుట్ట, చెన్నూరు, చేవెళ్ల, చొప్పదండి, దేవరకద్ర, ధర్మపురి, డోర్నకల్, గద్వాల, స్టేషన్‌ఘన్‌పూర్, జడ్చర్ల, జగిత్యాల, జుక్కల్, కల్వకుర్తి, కోదాడ, కొత్తగూడెం, మక్తల్, మానకొండూరు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మునుగోడు, నాగార్జునసాగర్, నాగర్‌కర్నూల్, నకిరేకల్, నారాయణఖేడ్, నారాయణపేట, నర్సంపేట, నిజామాబాద్, పరకాల, పెద్దపల్లి, పినపాక, రామగుండం, సత్తుపల్లి, తాండూరు, తుంగతుర్తి, వనపర్తి, వైరా, ఇల్లందుల్లో సమీకృత గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. 

పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో.. 
    యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులతో భట్టి సమావేశమయ్యారు. అనంతరం మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకే సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇవి దేశంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ఉంటాయన్నారు. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సిలబస్‌ను రూపొందిస్తున్నామన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి భట్టి కృతజ్ఞతలు తెలిపారు.

మీడియా సమావేశంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్‌ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా సమీకృత గురుకులాలకు రూ.11 వేల కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమంటూ.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన  సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)