Breaking News

గ్రేటర్‌లో 27 శివారు పట్టణాల విలీనానికి గవర్నర్‌ ఓకే

Published on Tue, 12/02/2025 - 01:23

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 20 పురపాలక సంఘాలు, 7 కార్పొరేషన్ల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఆమోద ముద్ర వేశారు. విలీన ప్రక్రియకు సంబంధించి సోమవారం ఆర్డినెన్స్‌ గెజిట్‌ జారీ కావాల్సి ఉండగా, గవర్నర్‌ సాంకేతికపరమైన అంశాలను లేవనెత్తడంతో కాస్త ఆలస్యం జరిగిందని సమాచారం. అయితే 10 నెలల కిందట ఉన్న పాలక మండళ్లు చేసిన తీర్మానాలను పరిగణనలోకి తీసుకొని నవంబర్‌ 25వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిని విస్తరిస్తూ ఆమోదం తెలిపిన విషయం విదితమే.

విలీనం సందర్భంగా జీహెచ్‌ఎంసీ చట్టానికి, పురపాలక చట్టానికి సవరణలు అవసరమైన నేపథ్యంలో ఈ రెండు ఆర్డినెన్స్‌లను తీసుకొని రావాలని నిర్ణయించి ప్రభుత్వం ఆమోదం తెలి పింది. 20 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను గ్రేటర్‌లో విలీనం చేయడానికి జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఆమోదం తెలిపింది. పదవీ కాలం ముగిసిన పాలక మండళ్లు గతంలో చేసిన తీర్మానాలు ఇప్పుడు చెల్లుబాటు కావన్న అభిప్రాయాన్ని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ వ్యక్తం చేసినట్టు, దానికి ప్రభుత్వం నుంచి సమాచారం వెంటనే పంపించినట్టు తెలిసింది. దీంతో గవర్నర్‌ సంతకం చేసి పంపించగా, దీని ఆధారంగా ప్రభుత్వం గెజిట్‌ జారీ చేయనుంది.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)