Breaking News

పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య

Published on Tue, 04/08/2025 - 01:38

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జగదభిరాముడికి సోమవారం పట్టాభిషేక మహోత్సవం çవైభవోపేతంగా జరిగింది. సీతారాముల కల్యాణం మరుసటి రోజున పుష్యమి నక్షత్రం సందర్భంగా మిథిలా స్టేడియంలో రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. 

ఉదయం 10 గంటలకు శంఖ, చక్ర, ధనుర్బాణాలు ధరించిన సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను పల్లకీ సేవగా బయటికి తెచ్చారు. మేళతాళాలు, కోలాటం, భజంత్రీలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ సింహాసనంపై కొలువుదీర్చారు. వైదిక మంత్రాలతో వశిష్టుడు, వామనుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు, సుయజ్ఞుడును వేద పండితులు వరింప జేసుకున్నారు.  

సప్త సముద్రాలు, సకల నదుల జలాలు 
పట్టాభిషేకం జరిగే ప్రధాన మండపానికి ముందు మూడు ఉప మండపాల్లో మూడు కలశాలను ఏర్పాటు చేశారు. ఒక మండపంలో సముద్ర, నదీ జలాలను ఆవాహన చేశారు. మరో కలశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు రామ పరివారాన్ని ఆవాహన చేశారు. మరో కలశంలో అష్టదిక్పాలకులను, పట్టాభిషేకానికి ఉపయోగించే వస్తువులతోపాటు ఆది దేవతలను ఆవాహన చేస్తూ చతుర్వేద హవన పురస్కృతంగా మండపత్రయ ఆరాధన నిర్వహించారు. అనంతరం అష్టోత్తర  శతనామార్చన చేశారు.   

అటు రాజదండం, ఇటు రాజఖడ్గం 
మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్న సుముహూర్తాన బంగారు సింహాసనంపై స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్ర కిరీటాలను స్వామివారికి ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆవాహన చేసిన రాజముద్రికను కుడి చేతి వేలికి తొడిగారు. ఆ తర్వాత పూర్తి రాజ లాంఛనాలతో సామ్రాట్‌ కిరీటాన్ని శ్రీరాముడికి అలంకరించారు. రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకం సీతాదేవికి, రామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు.

స్వర్ణఛత్రం నీడలో ఎడమ వైపు రాజఖడ్గం, కుడి వైపున రాజదండంతో శ్రీరాముడిని అలంకరించారు. తలపై సామ్రాట్‌ కిరీటంతో గరుత్మంతుడు, వైనేతుడులు అందించే చామరల సేవను ఆస్వాదిస్తూ భక్తులకు రామయ్య దర్శనం ఇచ్చారు. అనంతరం మండపత్రయంలో మంత్రించిన జలాలను శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తికి మంగళహారతి ఇచ్చారు. చివరగా ముత్యాల దండతో ఆంజనేయుడి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

పట్టువ్రస్తాలు సమర్పించిన గవర్నర్‌ 
పట్టాభిషేక వేడుకకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకోగా పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం గవర్నర్‌ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్‌ శ్రీధర్, కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్‌ పాల్గొన్నారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)