రోగాలకు ‘గూగుల్‌ చికిత్స’ వద్దు

Published on Sun, 01/28/2024 - 04:56

మాదాపూర్‌: కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మాదా­పూర్‌లోని యశోద హాస్పిటల్‌లో అత్యాధునిక క్రిటికల్‌ కేర్‌ నెఫ్రాలజీపై శనివారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రోజు­రోజుకీ జీవన విధానంలో మార్పులు రావడం వల్లనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగు­తున్నాయని, ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. గ్రామా­లలో చాలా మందికి కిడ్నీ సమస్యలపై అవగాహన లేకపోవడంతో, సంబంధంలేని డాక్టర్ల వద్దకు వెళ్లి మోతాదుకు మించిన మందులను వాడుతుండటంతో కిడ్నీ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు.

చాలా మంది గూగుల్‌ సెర్చ్‌ చేసి స్వయంగా మందులు వాడటంతో అవి పెద్ద సమస్యలుగా మారుతున్నాయన్నారు. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మందులను వాడాలని, సంబంధించిన డాక్టర్‌ వద్ద మాత్రమే చికిత్స పొందాలని గవర్నర్‌ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందిస్తోందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. కిడ్నీలను పరీక్షించేందుకు గతంలో సరైన పరికరాలు ఉండేవి కాదని, ప్రస్తుతం అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలాంటి సదస్సులను నిర్వహించడం వల్ల రోగులకు వ్యాధులపై అవగాహనతో పాటు మెరుగైన చికిత్సను అందించవచ్చని చెప్పారు.

యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి మాట్లాడుతూ, ఏకేఐ నిర్ధారణ సీరం క్రియాటిన్‌ పెరుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచంలో దాదాపు 850 మిలియన్‌ ప్రజలు ఏదో ఒక మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధులు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, క్రిటికల్‌ కేర్‌ నెఫ్రాలజీ వ్యాధులపై చర్చించడానికి సదస్సులో అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో వేయి మందికిపైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)