Breaking News

TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

Published on Wed, 10/04/2023 - 18:53

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 

వివరాల ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. అక్టోబరు వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా ఈ వివరాలను వెల్లడించారు. 

ట్విట్టర్‌ వేదికగా వీసీ సజ్జనార్‌..‘టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: TS: ఈనెల 13 నుంచి స్కూళ్లకు బతుకమ్మ, దసరా సెలవులు

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)