Breaking News

ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టారా?.. స్టేటస్‌ ఇలా తెలుసుకోండి

Published on Fri, 02/28/2025 - 10:23

బంజారాహిల్స్‌ : అర్హులైన నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. ఏడాది క్రితం ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించగా సర్వే నిర్వహించి లబి్ధదారులను గుర్తించారు. అయితే జాబితాలో పేర్లు లేని వారి కోసం మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే సర్వే సమయంలో పలువురు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏ విధంగా నమోదు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమ దరఖాస్తు పరిస్థితి ఏమిటో సమాచారం తెలియక చాలా మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అటు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి ఇటు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ, ఇంకోవైపు కలెక్టర్‌ ప్రజావాణి, మరోవైపు ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ప్రజావాణిలోనూ పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు సర్వే నిర్వహణపై ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజీగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్‌ డివిజన్లు, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధి కిందికి వచ్చే షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల పరిధిలో సర్వే నిర్వహణపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సర్వేపై సందేహాలు ఉంటే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ అవకాశం కలి్పంచారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో రోజూ 150కి పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. వాటికి సమాధానం చెప్పేందుకు అధికారులు ఆన్‌లైన్‌లో జాబితాను రూపొందిస్తున్నారు. 

అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయొచ్చు.. 
👉: ఇందిరమ్మ ఇళ్ల సర్వే వివరాల నమోదుపై అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసుకునే సదుపాయం ఉంది. దీనికి ఫిర్యాదులపై క్లిక్‌ చేసి మన మొబైల్‌ నెంబర్‌ టైప్‌ చేయగానే ఓటీపీ వస్తుంది.

👉: ఓటీపీ ఎంటర్‌ చేయగానే ఫిర్యాదు పేజీ ఓపెన్‌ అవుతుంది.

👉: మన ఆధార్‌ నెంబర్‌ నమోదు చేయగానే పలు వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదవుతాయి.

👉: ఫిర్యాదుల కేటగిరి ఎంచుకోగానే కింద ఐచి్ఛకలు కనిపిస్తాయి.

👉: సర్వేయర్‌ సందర్శించలేదు, సంతృప్తి చెందలేదు, సర్వే సక్రమంగా జరగలేదు, సర్వే సమయంలో గైర్హాజర్‌ అయ్యారు, ప్రజాపాలనలో దరఖాస్తు చేయలేదు, మధ్యవర్తితో సమస్యలు, డబ్బులు డిమాండ్‌ చేస్తున్న సర్వేయర్‌.. వీటిలో దరఖాస్తుదారుడు ఎదుర్కొన్న సమస్యను ఎంచుకుని ఫిర్యాదు వివరాలు రాయాల్సి ఉంటుంది.

👉: అనంతరం ఏదేని ధ్రువపత్రాన్ని అప్‌లోడ్‌ చేసి సబ్మిట్ పై నొక్కాలి.

👉: వెంటనే మొబైల్‌ ఫోన్‌కు ఫిర్యాదు నెంబర్‌ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఫిర్యాదు వివరాలు తెలుసుకోవచ్చు.

దరఖాస్తు స్థితి ఇలా తెలుసుకోవచ్చు.. 
గూగుల్‌లోhttps://indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌ను నమోదు చేయగానే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో అప్లికేషన్‌ సెర్చ్‌ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్‌ నెంబర్, ఆధార్‌కార్డు, అప్లికేషన్‌ ఐడీ, రేషన్‌కార్డు అంశాల్లో ఏదో ఒక వివరాలు నమోదు చేయగానే మన అప్లికేషన్‌ వివరాలు ప్రత్యక్షమవుతాయి. సర్వే స్థితి, అది ఏ పరిస్థితిలో ఉందో గమనించవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)