హెచ్‌ఎంపీవీ వైరస్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌

Published on Sat, 01/04/2025 - 19:05

సాక్షి, హైదరాబాద్‌: HMPV (హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌) వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. హెచ్‌ఎంపీవీ సోకితే జలుబు, దగ్గుతో పాటు ముక్కు మూసుకుపోవడం (శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడం), ముక్కుకారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని.. ఇది కొందరిలో ఊపిరితిత్తులను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యారోగ్య హెచ్చరించింది.

హెచ్ఎంపీవి వైరస్ కారణంగా తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లు (స్కిన్ ఇన్ఫెక్షన్) కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని.. జలుబు, దగ్గు, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇమ్యూనిటీ సిస్టం బలహీనంగా వుండే చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్‌ ఏజెన్సీ

కరోనా మాదిరిగానే ఈ HMPV వైరస్ కూడా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. గాలి ద్వారా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో ఉపయోగించిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అనారోగ్య సమస్యలతో రద్దీ ప్రాంతాలకు వెళ్లడంవల్ల ఇతరులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయని.. జన సామర్త్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగితే HMPV వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

#

Tags : 1

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)