Breaking News

గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: పొన్నం

Published on Sat, 09/28/2024 - 05:49

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): గల్ఫ్‌ దేశాల్లో ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందన్నారు. గల్ఫ్‌లో పనిచేసే కార్మికుల కుటుంబాల పిల్లల చదువుకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కలి్పస్తున్నామని చెప్పారు. శుక్రవారం బేగంపేట్‌లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో గల్ఫ్‌ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం.. గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్‌ హుస్సేన్‌ కుటుంబం నుంచి మొదటి అభ్యర్థనను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో గల్ఫ్‌ కార్మికుల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌ దివ్య, ఎన్నారై విభాగం సలహాదారుడు బొజ్జ అమరేందర్‌రెడ్డి, ప్రతినిధులు భీంరెడ్డి, నంగి దేవేందర్‌ రెడ్డి, నరేశ్‌రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్‌ రావు, తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మహ్మద్‌ జబ్బార్, ఉపాధ్యక్షుడు మహ్మద్‌ మిస్రీ తదితరులు పాల్గొన్నారు. 

పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్‌: హైడ్రాపై పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దని, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట...అధికారం కోల్పోయిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. సచివాలయంలో శుక్రవారం పొన్నం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడం కడితే కూల్చేస్తామని నాడు కేసీఆర్‌ అన్నారా లేదా అని పొన్నం ప్రశ్నించారు. మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని స్వయంగా నాటి మంత్రి కేటీఆర్‌ చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని, మూసీ మీద ఉన్న ఇళ్లను మాత్రమే తొలగిస్తున్నామని, వాళ్లకు సొంత ఇళ్లు వచ్చేలా, మెప్మా ద్వారా ఉపాధి అవకాశాలు కలి్పంచడానికి కార్యాచరణ చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)