Breaking News

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు?

Published on Fri, 11/08/2024 - 08:22

సాక్షి,హైదరాబాద్‌:ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు అనూహ్య మలుపు తిరిగింది.  ఈ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరుకాని ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్‌ కార్డు వచ్చినట్లు సమాచారం. అమెరికాలో సెటిల్ అయిన కుటుంబసభ్యుల ద్వారా ఆయన కొద్దిరోజుల క్రితమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయినట్టు తెలుస్తోంది.

గ్రీన్ కార్డు మంజూరు విషయం  తెలిసి ఫోన్‌ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు అధికారులు ఈ విషయమై ఆరా తీశారు. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు లభించడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పై పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో  ఫోన్‌ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన అమెరికా వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదు. 

ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ: కేటీఆర్‌ 
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)