Breaking News

'స్థానిక' పోరుకు మోగిన నగారా.. ఎన్నికల షెడ్యూల్ విడుదల

Published on Mon, 09/29/2025 - 10:49

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక ఎన్నికలకు(Telangana Local Body Elections Schedule) నరాగా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మూడు విడుతల్లో స్థానిక సంస్థలు జరగనున్నట్టు ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. అక్టోబర్‌ 23న ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రారంభం కాగా.. నవంబర్‌ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది.  

ఎన్నికల సంఘం కమిషనర్‌(Telangana Elections) సోమవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో అధికారులు చర్చించారు. ఎన్నికల కోసం 15,302 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 1,12,280 వార్డులు ఉన్నాయి. 81,61,984 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానున్నట్టు తెలిపారు. 

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..

  • రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.
  • అ‍క్టోబర్‌ 9, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషేన్‌ విడుదల.
  • మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు..
  • అక్టోబర్‌ 17, 21, 25 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌
  • అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్‌,
  • అక్టోబర్‌ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలు,
  • అక్టోబర్‌ 31న, నవంబర్‌ 4, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.
  • నవంబర్‌ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌. 
  • పోలింగ్‌ రోజునే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు. 
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్‌ 11.
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్‌ 15.

ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు 14 ఎంపీటీసీలు, 27 జీపీలు, 246 వార్డులకు ఎన్నికలను ఎన్నికల సంఘం నిలిపివేసింది. ములుగులో 25 జీపీలు, కరీంనగర్‌లోని రెండు జీపీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)