Breaking News

ఇతర బకాయిలకు జమ చేసుకోవద్దు

Published on Fri, 07/19/2024 - 06:13

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే దఫాలో ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఆగస్టు నెల దాటకముందే మొత్తం రూ.31 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. రుణమాఫీ కింద విడుదల చేస్తున్న నిధులను రైతులకు సంబంధించిన ఇతర బకాయిల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. గురువారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.

రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి బకాయిలు రికవరీ చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు, బ్యాంకులు రికవరీ చేసే మొత్తం కలుపుకొని రైతులను రుణ విముక్తులను చేయాలని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లామని గుర్తు చేశారు.

ఇచి్చన మాట మేరకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. 40 లక్షల బ్యాంకు ఖాతాల నుంచి రూ.31 వేల కోట్ల రైతు రుణాలు ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు. బ్యాంకర్లను వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ అడగకుండా పూర్తిగా చెల్లిస్తున్నందుకు బ్యాంకర్లు కూడా రైతుల మాదిరి పండుగ చేసుకోవాలని భట్టి అన్నారు. రుణమాఫీ కాగానే రైతులకు అవసరమైన రుణాలు విరివిగా ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు.  

దేశం గరి్వంచదగ్గ రోజు: తుమ్మల 
ఇది దేశం గర్వించదగిన రోజు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. రుణమాఫీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తీవ్రంగా శ్రమించారని తెలిపారు. వర్షాలు మొదలయ్యాయని, రైతు రుణమాఫీ నిధులు సకాలంలో అందితే వ్యవసాయం పండుగలా మారుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లాకు ఎక్కువ నిధులు 
గురువారం తొలివిడత కింద రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ విడుదల చేసిన నిధుల్లో అత్యధికం నల్లగొండ జిల్లాకు వెళ్లాయి. ఈ జిల్లాకు చెందిన 78,463 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.454.49 కోట్లు జమ అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా తీసుకుంటే అత్యధికంగా ఆందోల్‌ నియోజకవర్గంలో 19,186 కుటుంబాలకు రూ.107.83 కోట్లు విడుదల అయ్యాయి. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)