Breaking News

తెలంగాణలో కొత్త వేరియెంట్‌ కలకలం

Published on Wed, 12/20/2023 - 09:32

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త వేరియెంట్‌ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నాలుగు కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది. కొత్త వేరియెంట్‌ విజృంభించే అవకాశం ఉండడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. తాజా కేసుల్లో స్వాబ్‌ నమునాలను పరీక్షలకు పంపగా.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 

మరోవైపు చలికాలం కావడంతో ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త వేరియెంట్‌ జేఎన్‌.1 కలకలం రేగింది. దీంతో చాలామంది కరోనా పరీక్షలకు వెళ్తున్నారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా 402 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ఇందులో నాలుగు పాజిటివ్‌గా తేలాయి. వాళ్లకు సోకిన వేరియెంట్‌ను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 


ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. 

మరోవైపు కేంద్రం సూచనతో రాష్ట్ర వైద్య విభాగం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. కేరళ, శబరిమల నుంచి వచ్చిన వాళ్లను ట్రేస్‌ చేసి.. పరీక్షలు నిర్వహించాలనుకుంటోంది.  ఇంకోవైపు అధికార యంత్రాంగం సైతం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో యాభై బెడ్లతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. వెంటిఏటర్లు, ఆక్సిజన్‌ బెడ్లతో పాటు సాధారణ బెడ్లను అందుబాటులో ఉంచారు.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)