Breaking News

చలి చలిగా.. రోడ్లు ఖాళీగా!

Published on Thu, 12/25/2025 - 07:36

సాక్షి, హైదరాబాద్‌: మహానగరంలో చలి మామూలుగా లేదు.. నగరవాసిని గజగజ వణికిస్తోంది.. సాధారణ ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోతున్నాయి.. శీతల గాలులు విజృంభిస్తున్నాయి.. రాత్రిపూట చలిచలిగా ఉంటోంది.. ఉదయంపూట రోడ్లు ఖాళీఖాళీగా ఉంటున్నాయి.. మొత్తంగా నగరం చలి పంజాలో చిక్కుకుని ఉంది. సగటున నగరంలో 12.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శివారు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ప్రజలు స్వెటర్లు, జాకెట్లు, దుప్పట్లను ఆశ్రయిస్తున్నారు. శీతల గాలుల ప్రభావంతో ఉదయం వేళల్లో రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. 

పార్కులు, మార్నింగ్‌ వాక్‌ చేసే ప్రాంతాల్లో ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గింది. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లేవారు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పేదల జీవనం చలితో మరింత కష్టంగా మారింది. రోడ్ల పక్కన నివసించే వారు ఉదయం వేళ చలి మంటలు వేసుకుని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లు పంపిణీ చేస్తూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రాబోయే కొన్ని రోజులు కూడా చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశముంది. సాధ్యమైనంత మేరకు ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని, వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.    

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)