Breaking News

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివే!

Published on Thu, 03/06/2025 - 07:40

సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అఖిలపక్షం అధ్వర్యంలో ఢిల్లీలో నిరసనపై కేబినెట్‌ చర్చించనుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా, కొత్త రేషన్ కార్డుల జారీ వేగవంతం అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. మెప్మాను సెర్ప్‌లో విలీనం చేసే అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వేసవి కాలంలో తాగు నీటి ఇబ్బందులు రాకుండా చేపట్టవలసిన చర్యలపై కూడా కేబినెట్‌ చర్చించనుంది.

కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై నిన్న(బుధవారం).. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కీలక భేటీ జరిగింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన మార్గదర్శకాలపై చర్చించారు.

మొత్తం నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఒకవేళ సీపీఐకి ఒక స్థానం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుందామనే కోణంలో చర్చించారు. ఏ సామాజికవర్గానికి, ఏ జిల్లాకు ఎలాంటి పదవులు ఇవ్వాలి.. ఎమ్మెల్సీలుగా ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై ఓ అభిప్రాయానికి వచ్చారు. అయితే, ఎమ్మెల్సీలతోపాటు ఇతర అన్ని పదవుల భర్తీపై కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించేందుకుగాను ఈనెల 7వ తేదీన ఢిల్లీకి రాష్ట్ర నాయకత్వం వెళ్లనున్నట్టు సమాచారం.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)