Breaking News

తెలంగాణ మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం

Published on Fri, 10/31/2025 - 12:32

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. అజహరుద్దీన్‌ కలిసి కేబినెట్‌లో 15 మంది మంత్రులు ఉన్నారు.

కాగా, అజహరుద్దీన్‌కు ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనకు కీలకమైన పదవిని అప్పగిస్తారా లేక మైనారిటీ సంక్షేమ శాఖతో సరిపుచ్చుతారా అనే చర్చ జరుగుతోంది.

ప్రమాణ స్వీకారం అనంతరం  అజహరుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ‘‘నన్ను మంత్రిగా చూసినందుకు నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు చాలా సంతోషపడుతున్నారు. నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రికి, రాష్ట్ర పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. నేను ప్రత్యేకమైన వ్యక్తిని... నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిజం కావు. నా గురించి కిషన్ రెడ్డికి పూర్తిస్థాయిలో అవగాహన లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు సరైనవి కావు. నా తక్షణ కర్తవ్యం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం’’ అని అజహరుద్దీన్‌ పేర్కొన్నారు.

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)