Breaking News

ఎలాంటి ఎజెండా లేకుండానే..

Published on Thu, 01/29/2026 - 04:27

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షతన జరగనున్న ఉభయ రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ తొలి సమావేశానికి ఎలాంటి ఎజెండా లేకుండానే వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని సీడబ్ల్యూసీ సమావేశ మందిరంలో భేటీ కానుంది. 

ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీలోగా సంబంధిత అంశాలతో ఎజెండాను పంపించాలని రెండు రాష్ట్రాలను కేంద్రం కోరింది. అయితే కమిటీ తదుపరి సమావేశాల్లో చర్చించాల్సిన, చర్చించకూడని అంశాలపై తొలి సమావేశంలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు శాశ్వత ఎజెండాను ఖరారు చేసేలా 30వ తేదీన కేంద్రాన్ని కోరాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏపీ మాత్రం ఐదు అంశాలతో కూడిన ఎజెండాను కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. 

తెలంగాణ ప్రాజెక్టులే ఏపీ ఎజెండా
తెలంగాణలోని ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని ఏపీ ఎజెండాను ప్రతిపాదించింది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలోని ప్రాజెక్టుల వారీగా 940.87 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లతో పాటు టెక్నికల్‌ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) ఇచ్చిన అనుమతుల పత్రాలు అందజేయాలని కోరనుంది. 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల పత్రాలనూ ఇవ్వాలని విజ్ఞప్తి చేయనుంది. ఇక సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా కృష్ణా పరీవాహకంలో తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు, వాటిని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలను వివరించాలని కోరనుంది. కృష్ణా/ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాలకు ఉన్న వాటాలపై స్పష్టత ఇవ్వాలని కోరడంతో పాటు పోలవరం–నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. 

అయితే పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్‌ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 30న భేటీలో ఈ అంశాన్ని ఏపీ ప్రతిపాదిస్తే తీవ్రంగా వ్యతిరేకించాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)