Breaking News

నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ

Published on Fri, 01/02/2026 - 06:22

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు స్వల్ప విరామం తరువాత శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న వేళ.. పలు కీలక అంశాలపై చర్చకు అధికారపక్షం సిద్ధమైంది.  ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గత ప్రభు త్వం ఏటా రూ.కోట్లు అప్పనంగా ఏజెన్సీలకు పంచిపెట్టార ని ఆరోపిస్తున్న అధికారపక్షం ఈ అంశంతోపాటు పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ విధంగా కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వినియోగించుకోలేక పోయిందో, అలాగే సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల జరిగిన నష్టంపై చర్చ చేపట్టనుంది.

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 42 శాతం బీసీ రిజర్వేషన్లతో నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై కూడా ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపించినా.. అవి ఆమోదానికి నోచుకోకపోవడం, ఆ బిల్లులు రాష్ట్రపతికి చేరి నెలలు గడుస్తున్నా ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో.. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాన్ని ప్రభుత్వం చర్చకు పెట్టనున్నట్లు తెలిసింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఒక నిర్ణయానికి రావాలని సర్కారు భావిస్తున్నట్టు చెబుతున్నారు. పంచాయతీరాజ్‌ ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయకుండానే పూర్తిచేసిన విషయం విదితమే.

నేడు అసెంబ్లీలో ఉపాధి హామీపై స్వల్పకాలిక చర్చ
శుక్రవారం శాసనసభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవగానే బీఏసీ ఖరా రు చేసిన ఎజెండాతోపాటు రవాణా, రోడ్లు–భవనాల శాఖకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించనున్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ విస్తరణ, వార్డుల పునర్విభజనకు సంబంధించిన బిల్లులపై సభ చర్చించనుంది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మూసీ పునరుజ్జీవం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. మరోవైపు శాసన మండలిలోనూ సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అవుతుంది. అనంతరం ప్రభుత్వ బిల్లులపై చర్చ జరగనుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)