Breaking News

బీసీ రిజర్వేషన్లకు 5న కేబినెట్, అసెంబ్లీ ఆమోదం!

Published on Sun, 02/02/2025 - 04:02

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశాన్ని ఈ నెల 5న జరగనున్న కేబినెట్‌ సమావేశంలో తేల్చనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన 5న మంత్రివర్గం భేటీ అవుతోంది. ఆ సమావేశంలో కులగణన నివేదికపై చర్చించి, బీసీ రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేస్తారని తెలిసింది. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఆ నివేదికపై సభలో చర్చించను న్నారు. అదే రోజు నివేదికను సభ ఆమోదించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.

కాగా ఆదివారం  ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా కులగణన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కు సచివాలయంలో అందించనున్నట్లు తెలిసింది. ఉత్తమ్‌ నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ,  శ్రీధర్‌బాబు, పొన్నం, సీతక్కలతో కులగణనపై గత ఏడాది అక్టోబర్‌ 19న మంత్రివర్గ ఉపసంఘం వేసిన విషయం తెలిసిందే.

ఈ ఉపసంఘం ఆది, సోమవారాల్లో సమావేశమై నివేదికపై చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేయనుంది. ఆ తర్వాత తుది నివేదికను సీఎం కు సమర్పించనుంది. ఉపసంఘం సూచనల మేరకు రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించి ఈ నివేదికను రూపొందించిన విషయం తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)