Breaking News

పాలిసెట్‌లో 65.5 శాతం సీట్ల భర్తీ

Published on Wed, 07/16/2025 - 04:41

సాక్షి, హైదరాబాద్‌: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌లో ఎట్టకేలకు సాంకేతిక విద్యావిభాగం విద్యార్థులకు కాలేజీల్లో సీట్లు కేటాయించింది. వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్‌ డేటా ఎరేజ్‌ అవ్వడం, దాన్ని వారం రోజుల తర్వాత రికవరీ చేయడంతో ముందుగా ప్రక టించిన తేదీకంటే పది రోజులు ఆలస్యంగా మంగళవారం సీట్లు కేటాయించారు. తొలివిడతలో 65.5 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసారి ప్రభుత్వ కాలేజీలకే విద్యార్థులు ప్రాధాన్యమిచ్చారు. వీటిల్లోని మొత్తం సీట్లలో 82 శాతం నిండగా, ప్రైవేట్‌ కాలేజీల్లో కేవలం 50 శాతం సీట్లు మాత్రమే నిండాయి. మొదటి విడత సీట్ల భర్తీ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో 10,012 సీట్లు మిగిలాయి. అయితే, వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్నా.. రెండు వేలమందికి సీట్లు రాకపోవటం గమనార్హం.  

⇒ మొదటి విడతలో 6 కాలేజీల్లోని వందశాతం సీట్లు నిండాయి. వీటిలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలుండగా, ఒక ప్రైవేట్‌ కాలేజీ ఉంది. 
⇒ ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 713 సీట్లు నిండాయి. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌కోటాను తుదివిడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. 
⇒ సీట్లు పొందినవారు ఈ నెల 18లోగా ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోరి్టంగ్‌ చేయాలి.  

⇒ తుది విడత కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత విద్యార్థులు ఈ నెల 28 నుంచి 30 లోపు కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్‌ చేయాలి. ఇలా రిపోర్ట్‌ చేయకపోతే సీటు కోల్పోతారు. 
⇒ ఈ నెల 28 నుంచి 30 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్‌ నిర్వహిస్తారు. 31 నుంచి పాలిటెక్నిక్‌ మొదటి సెమిస్టర్‌ క్లాసులు ప్రారంభమవుతాయి. 
⇒ ఆగస్టు 2, 3 తేదీల్లో సెంట్రలైజ్డ్‌ ఇంటర్నల్‌ స్లైడింగ్‌ ఉంటుంది. కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలోని మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే ఈ స్లైడింగ్‌ విధానంలో మార్చుకోవచ్చు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)