Breaking News

ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు

Published on Sat, 06/07/2025 - 04:19

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరం భారీ ద్రవ్యలోటుతో ప్రారంభమైంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తొలి మాసమైన 2025, ఏప్రిల్‌ నెలలో రూ.4,023.11 కోట్ల ద్రవ్యలోటు నమోదైనట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నెలలో రూ.1,020 కోట్ల ద్రవ్య మిగులుతో ప్రారంభం కావడం గమనార్హం.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్ను రాబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయని కాగ్‌ నివేదిక చెబుతోంది. ఆ నెలలో రూ.10,916.68 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో పన్నుల రూపంలో రూ.11.464.17 కోట్లు వచ్చాయి. అయితే, ఈ ఏడాది అప్పులతో కలిపి ఏప్రిల్‌లో రూ.16,473.99 కోట్లు వచ్చాయి. ఇందులో అప్పు రూ. 5,230.99 కోట్లు. 

ఖర్చులు అనివార్యం
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలో రెవెన్యూ ఖర్చు రూ.15,262 కోట్లుగా నమోదైంది. ఇందులో గత అప్పులకు వడ్డీల చెల్లింపులు రూ.2,260 కోట్లు, వేతనాలకు రూ.3,968 కోట్లు, పింఛన్ల రూపంలో రూ.1,569 కోట్లు, సబ్సిడీల కింద రూ.4,187 కోట్లు, రెవెన్యూ పద్దు కింద రూ.3,275 కోట్లు ఖర్చయ్యాయి. మూలధన వ్యయం కింద రూ.1,204 కోట్లు కలిపి మొత్తం ఖర్చు రూ.16,466.63 కోట్లుగా నమోదైంది.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)