Breaking News

పొలం రిజి్రస్టేషన్‌కు డబ్బులు డిమాండ్‌

Published on Sun, 06/22/2025 - 11:08

అశ్వాపురం: పట్టాదారు పాస్‌ పుస్తకం ఉన్న పొలాన్ని తన అవసరం నిమిత్తం ఓ రైతు అమ్మేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకుని తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లగా.. రిజిస్ట్రేషన్‌కు తహసీల్దార్‌ డబ్బు డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ రైతు తహసీల్దార్‌కు డబ్బులు ఇస్తూ వీడియో తీయగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ఓ రైతు తన అవసరం నిమిత్తం మరో రైతుకు 20 గుంటల పొలం అమ్మాడు. 

ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేశాక రిజిస్ట్రేషన్ కు కోసం వెళ్లగా ఇద్దరు రైతులను కలిపి తహసీల్దార్‌ రాజారావు రూ.15 వేలు డిమాండ్‌ చేశాడు. వారు అవాక్కయి పాస్‌ బుక్‌ ఉందని, రిజి్రస్టేషన్‌కు డబ్బులు ఎందుకని ప్రశ్నించగా ఫార్మాలిటీ ఇవ్వాల్సిందే అన్నాడు. కానీ వారు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ రోజు రిజి్రస్టేషన్‌ చేయలేదు. మరునాడు పొలం అమ్మిన రైతు రూ.5 వేలు ఇస్తానని చెప్పడంతో తహసీల్దార్‌ రిజి్రస్టేషన్‌ చేశాడు. ఆపరేటర్‌కు రూ.1,000 ఇచ్చాడు. అయితే తహసీల్దార్‌కు రూ.5 వేలు ఇస్తూ రైతు తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

తహసీల్దార్‌పై బదిలీ వేటు: తహసీల్దార్‌ రాజారావును బదిలీ చేస్తూ కలెక్టర్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రైతు నుంచి ఆయన నగదు తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోస్టింగ్‌ ఇవ్వకుండా కలెక్టరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించగా, అశ్వాపురం డీటీ ఎస్‌కే రషీద్‌ను తహసీల్దార్‌గా (ఎఫ్‌ఏసీ) నియమించారు. 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)