Breaking News

కాళేశ్వరం బ్యారేజీలకు శాస్త్రవేత్తల బృందం

Published on Thu, 05/23/2024 - 03:44

కాళేశ్వరం/ సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనంలో భాగంగా పుణేలోని సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తలు రాష్ట్రానికి చేరుకున్నారు. జేఎస్‌ ఎడ్లబడ్కార్‌ (జియో టెక్నికల్‌ పరీక్షల నిపుణుడు), ధనుంజయ నాయుడు (జియో ఫిజికల్‌ పరీక్షల నిపుణుడు), ప్రకాశ్‌ పాలీ (నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ నిపుణుడు)తో కూడిన బృందం బుధవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించింది. ఇరిగేషన్‌ సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజనీర్లతో కలసి ఈ బృందం పరీక్షలు నిర్వహించింది. 

బృందం సభ్యులు ముందుగా మేడిగడ్డ బ్యారేజీ వంతెనపైన కాలినడకన వెళ్లి పరిశీలించారు. గత ఏడాది అక్టోబర్‌ 21న కుంగిన 7వ బ్లాక్‌లోని పియర్‌ను, అడుగు భాగం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. కుంగుబాటుకు గల కారణాలను సీఈని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు చేసిన పరీక్షల వివరాలను అడిగారు. బ్యారేజీ ఎగువ, దిగువ ప్రవాహ ప్రాంతాల్లో తిరిగారు. కుంగిన పియర్‌లు, క్రస్టుగేట్లు, అక్కడి పరిసరాలను ఫొటోలు తీసుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్‌లో 15 నుంచి 21వ పియర్‌ వరకు ఉన్న ఇసుక మేటలు, గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. 

గంటపాటు మేడిగడ్డను పరిశీలించిన అనంతరం అన్నారం బ్యారేజీకి వెళ్లారు. అక్కడ సీఈ, ఈఈ యాదగిరిలు వారికి బ్యారేజీలో ఏర్పడ్డ సీపేజీ బుంగలు, చేపట్టిన మరమ్మతుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం బ్యారేజీ డౌన్‌ స్ట్రీమ్‌లో చేస్తున్న సీసీ బ్లాక్‌ పనులను చూశారు. ఎగువన ఇసుక మేటలను చూసి త్వరగా వాటిని తొలగించాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ బృందం గురువారం సుందిళ్ల బ్యారేజీని సందర్శించనుంది. 

మూడు కేంద్ర సంస్థలతో పరీక్షలు..  
కాగా, బృందం పర్యవేక్షణలో బ్యారేజీలకు జియోటెక్నికల్, జియోఫిజికల్‌ పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో పాటు ఢిల్లీలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌), హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్జీఆర్‌ఐ)తో జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాతే శాశ్వత మరమ్మతులను నిర్వహించాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ ఇటీవల మధ్యంతర నివేదికలో సిఫారసు చేసింది.

దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలను ఇప్పటికే ప్రారంభించగా, త్వరలో ఎన్జీఆర్‌ఐ, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సంస్థల నుంచి సైతం శాస్త్రవేత్తలు పని ప్రారంభిస్తారని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. 

ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో వేర్వేరుగా ఈ పరీక్షలు నిర్వహించిన అనంతరం అవి సమర్పించే నివేదికల ఆధారంగా మరమ్మతులు నిర్వహించాలని సోమవారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)