Breaking News

నివేదికపై నిప్పులు!

Published on Sat, 02/28/2026 - 04:33

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యా కమిషన్‌ నివేదిక అన్ని వర్గా ల్లోనూ కలకలం రేపుతోంది. టీచర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. నిరుద్యోగులుమండిపడుతుండగా, విద్యార్థులు ఆగ్ర హంతో ఉన్నారు. విద్యావిధాన రూపకల్పనకు విద్యా కమి షన్‌ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను గురువారం సీఎంకు సమర్పించింది. ఇందులోని వివరాలను కమిషన్‌ చైర్మన్‌ మురళి అదే రోజు మీడియాకు వెల్లడించారు. ఇందులో టీచర్లకు వేత నాలు ఎక్కువగా ఉన్నాయని, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షను ఎత్తివే యాలని, ఇంటర్‌ బోర్డు స్థాయిలోనూ పరీక్షలు ఉండాలని, టీచర్ల నియామక విధానం మార్చాలని పేర్కొన్నా రు. ఈ అంశాలన్నీ ఆయా వర్గాల్లో వ్యతిరేకతకు దారి తీశాయి. 

ఆ సిఫార్సులు ఎవరి కోసం?
విద్యా కమిషన్‌ సభ్యులు కొన్ని నెలలుగా వివిధ వర్గాలతో చర్చించారు. పలు జిల్లాలు తిరిగారు. విదేశాలకూ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే నివేదిక రూపొందించినట్టు చెబుతున్నారు. 

⇒ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి కేంద్ర స్థాయిలో జేఈఈ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎప్‌ సెట్‌ చేపడుతున్నారు. విద్యా కమి షన్‌ రాష్ట్ర ఎప్‌సెట్‌ను ఎత్తివేయాలని సూచించింది. ఇంటర్‌ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్‌ సీటు ఇవ్వాలని ప్రతిపాదించింది. గతంలో ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల్లో 40 శాతం వెయిటేజీ తీసుకునే వారు. క్రమంగా దీనిని ఎత్తివేశారు. ఇంటర్‌ మార్కులే ప్రామాణికం కావడంతో కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థులకు ఎక్కవ సీట్లు వస్తున్నాయి. అట్టడుగు మారుమూల విద్యార్థులు నష్టపోతున్నారు.

అనేక అధ్యయనాల తర్వాత ఈ విధానాన్ని మార్చారు. ఇప్పుడు ఇంటర్‌ మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలనే విధానంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ సిఫార్సులు కార్పొరేట్‌ కాలేజీలకు వత్తాసు పలికేలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇంటర్‌లో రెండో ఏడాదే పరీక్షలు నిర్వహించాలనే సిఫార్సు కూడా కలకలం రేపింది. ఇది నాణ్యతను దెబ్బతీసే చర్యగా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కమిషన్‌ ఎదుట ఆందోళనకు విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నాయి. 

⇒  టీచర్స్‌ నియామక ప్రక్రియపై సిఫార్సులూ గందరగోళానికి దారి తీస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను డీఎడ్‌ అర్హతతో నియమిస్తారు. ఈ పోస్టులకూ బీఎడ్‌ అర్హత పెట్టాలన్న సిఫార్సులపై వ్యతిరేకత వస్తోంది.

టీచర్స్‌ సంఘాల వ్యతిరేకత
⇒ మార్కెట్‌ ప్రమాణాలతో టీచర్ల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని విద్యా కమిషన్‌ వ్యాఖ్యానించడం దారుణమని పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్‌ అన్నారు. భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. 
⇒  తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ పేరుతో గ్రామాల్లో స్కూళ్ల ను మూసివేసే దిశగా కమిషన్‌ సిఫార్సులున్నా యని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి పటోళ్ల చంద్రశేఖర్‌ తెలిపారు. 

⇒  అసంబద్ధ నిర్ణయాలతో కూడిన సిఫార్సుల వెనుక ఏ శక్తులున్నాయో అన్న అనుమా నం కలుగుతోందని, ఉపాధ్యాయులను చులకన చేసేలా సిఫార్సులున్నాయని ఆర్‌యూపీపీ టీఎస్‌ అధ్యక్షుడు సి జగదీశ్, ప్రధాన కార్యదర్శి ములుకనూరి శంకర్‌ అన్నారు. 
⇒ విద్యా కమిషన్‌ హద్దు మీరి వ్యవహరించిందని, టీచర్లకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ షౌకత్‌ అలీ డిమాండ్‌ చేశారు. విద్యా వ్యవస్థపై అధ్యయనం చేసే కనీస అర్హత కమిషన్‌ కోల్పోయిందన్నారు. 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)