పన్ను ఆదాయం 35 శాతమే

Published on Thu, 10/03/2024 - 04:33

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది రాష్ట్ర పన్ను ఆదాయం ఆపసో పాలు పడుతోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 5నెలల తర్వాత కూడా బడ్జెట్‌ అంచనాల్లో కేవలం 35.11% మాత్రమే పన్ను రాబడులు వచ్చాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.64 లక్షల కోట్లు పన్ను ఆదా యం కింద వస్తుందని రాష్ట్ర ప్రభు త్వం అంచనా వేయగా, ఆగస్టు 31 నాటికి కేవలం రూ.57వేల కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది ఐదు నెలల పన్ను ఆదాయంతో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ కావడం గమనార్హం. ఇందులో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకపు పన్ను ద్వారానే రూ.33,987 కోట్లు వచ్చాయి. 

ఎక్సైజ్‌ ఆదాయం ఆశించిన మేర రాకపోవడం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ల రూపంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోక్షం కలగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పట్టిక ఇబ్బందులు పడుతోందని ఇటీవల కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించిన గణాంకాలు చెబుతు న్నాయి. పన్ను ఆదాయం రాని కారణంగా అప్పులు కూడా భారీగానే చేయాల్సి వచ్చిందని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. 

తొలి అర్థ సంవత్సరంలో ఐదు నెలలు ముగిసేసరికి సుమారు రూ.30వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ రుణాలను సేకరించగా, అందులో రూ.10వేల కోట్లకు పైనే గతంలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే కట్టాల్సి వచ్చింది. ఇక, ఈ ఏడాది మూల ధనవ్యయం కింద రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఐదు నెలల్లో కేవలం రూ. 8,327కోట్లు మాత్రమే వెచ్చించడం గమనార్హం. 

ఇక, ప్రధాన ఖర్చుల్లో రెవెన్యూ పద్దు కింద రూ.35వేల కోట్లకు పైగా ఖర్చయింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు రూ.18,152 కోట్లు, పింఛన్లకు రూ.7,165 కోట్లు, వివిధ రకాల ప్రభుత్వ సబ్సిడీల కింద రూ.5,396 కోట్లు ఖర్చయ్యాయని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)