Breaking News

కేసీఆర్‌ సర్కార్‌పై గవర్నర్‌ తమిళిసై మరోసారి సంచలన వ్యాఖ్యలు

Published on Thu, 01/26/2023 - 18:09

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ తమిళిసైసౌందరరాజన్‌, ప్రభుత్వం మధ్య విమర్శలపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాటల దాడి మరింతగా పెరిగింది. గవర్నర్‌ తమిళిసై అటు పుదుచ్చేరిలో కూడా రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొన్నారు. 

ఈ క్రమంలో పుదుచ్చేరిలో కూడా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. 5 లక్షల మందితో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ పెట్టారు. కానీ, రిపబ్లిక్‌ డే వేడుకలకు మాత్రం కరోనాను సాకుగా చూపించారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. కేంద్రానికి నేను ఇవ్వాల్సిన రిపోర్టు పంపించాను. తెలంగాణలో అన్నీ అతిక్రమణలే. రాజ్యాంగ, రాజకీయ, చట్టపరమైన అతిక్రమణలు ఉన్నాయి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు తెలంగాణలో రాజ్‌భవన్‌ వేడుకల్లో పాల్గొన్న తమిళిసై కేసీఆర్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి’ అంటూ ఆమె కామెంట్స్‌ చేశారు.
 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు