Breaking News

‘స్పేస్‌’లో మన ప్రగతి గర్వకారణం!

Published on Sat, 01/21/2023 - 02:19

సాక్షి, హైదరాబాద్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వంటి స్వదేశీ సంస్థల ప్రగతి భారతీయులందరూ గర్వంగా తలెత్తుకుని తిరిగే­లా చేస్తోందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర­రాజన్‌ చెప్పారు. అయితే పరిశోధనల ఫలితాలు సామాన్య ప్రజలకు కూడా చేరినప్పుడే వాటికి సార్థకత అని పేర్కొన్నారు. శుక్రవారం హైదరా­బాద్‌­లోని భూభౌతిక పరిశోధన కేంద్రం (ఎన్‌జీ­ఆర్‌ఐ)లో ‘రీసెంట్‌ ట్రెండ్స్‌ ఇన్‌ స్పేస్‌ సెక్టార్‌: న్యూ ఇండియా’ పేరిట జరిగిన ఒకరోజు సదస్సు­లో గవర్నర్‌ మాట్లాడా­రు.

అంతరిక్ష రంగంలో ఇస్రో ఘనతలను కొనియాడారు. అంతరిక్ష రంగంలో జరిగిన పరిశోధనలు వివిధ రూపాల్లో సామాన్యుడికి ఉపయోగపడ్డాయని వివరించారు.  హైదరా­బా­ద్‌కు చెందిన స్టార్టప్‌లు స్కైరూట్, ధ్రువ స్పేస్‌లు దేశంలోనే మొదటిసారి ప్రైవేటుగా రాకెట్, ఉపగ్రహాలను విజయవంతంగా పరీక్షించడాన్ని గవర్నర్‌ అభినందించారు.

2026 నాటికి అంగారకుడిపైకి మనిషి..
అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంకో మూడేళ్లలోనే మనిషి అంగారక గ్రహంపైకి అడుగుపెట్టినా ఆశ్చ ర్యం లేదని ఇస్రో మాజీ చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ చెప్పారు. ప్రపంచంలో పౌర అవసరాలు తీర్చేందుకు అంత రిక్ష ప్రయోగాలు చేపట్టిన తొలి దేశంగా భారత్‌కు రికార్డు ఉందని, స్పేస్‌ టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగించుకున్న­దీ మన మేనని తెలిపారు. ప్రస్తుతం సుమారు 50 ఉపగ్రహాలు దేశానికి సేవలు అందిస్తున్నాయని.. పెరుగుతు న్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య రెండు వందలకుపైగా ఉండాలని పేర్కొన్నారు.

అరగంటలో ఖండాలు దాటేయవచ్చు..
అంతరిక్ష రంగంలో రానున్న పదేళ్లు చాలా కీలకమని దేశంలో తొలి ప్రైవేట్‌ అంతరిక్ష ప్రయోగ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ సీఈవో పవన్‌కుమార్‌ చందన తెలిపారు. ప్రపంచంలోని 90కిపైగా దేశాలకు తమవైన ఉపగ్రహా­లు లేవని, యాభై శాతం జనాభాకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో లేదని వివరించారు.  మరో పది, ఇరవై ఏళ్లలో కేవలం అరగంట సమయంలోనే ఖండాలను దాటేసేందుకు రాకెట్లను ఉపయోగించే పరిస్థితి రానుందని చెప్పారు.

విమానాల మాదిరిగానే రాకెట్లను కూడా మళ్లీమళ్లీ వాడుకునే దిశగా స్కైరూట్‌ పరిశోధన చేపట్టిందని తెలిపారు. సెమినార్‌లో ధ్రువస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో నెక్కంటి సంజయ్, అకాడమీ ఫర్‌ సైన్స్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూని­కేషన్స్‌ చైర్మన్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ సీహెచ్‌ మోహనరావు, ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్, కేంద్ర ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ విభాగం కార్యదర్శి ఎం రవిచంద్రన్‌ పాల్గొన్నారు.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)