Breaking News

మహా ‘ఘన’పతిం..

Published on Thu, 12/26/2024 - 04:45

సాక్షి, నాగర్‌కర్నూల్‌: దేశంలోనే ఎత్తయిన ఏకశిలా వినాయకుని విగ్రహం నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. దుందుభీ వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. 

కర్ణాటకలోని శ్రావణ బెళగోళలోని గోమటేశ్వరుడు, చాముండి కొండపై నందీశ్వరుడితోపాటు.. ఆవంచలోని గణపతి సైతం అతిపెద్ద ఏకశిలా విగ్రహాలుగా ప్రసిద్ధి. హైదరాబాద్‌ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో.. జడ్చర్ల పట్టణానికి చేరువలో ఆవంచ గ్రామంలో ఈ మహా గణనాథుని విగ్రహం ఉంది. 

ఏటా వినాయక చవితి సందర్భంగా వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మహా గణపతిని దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే గణనాథునికి ఇప్పటికీ ఆలయం లేకపోవడంతో నిత్య పూజలకు నోచుకోవడం లేదు.
 
పశ్చిమ చాళుక్యుల కాలంలో.. 
పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేకమల్లుడు, భువనైకమల్లుడు, తైలోక్యమల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్షాు్వ్కలు.. గణపతి భక్తులు కావడంతో ఇక్కడ 26 అడుగుల ఎత్తయిన ఏకశిలా గణపతిని నెలకొల్పినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. 

పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. పశ్చిమ చాళుక్యుల కాలంలోనే గ్రామ శివారులోని భైరవాలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివపంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది. 

ఆదరణ లేక.. 
ఆవంచలోని భారీ ఏకశిలా గణనాథునికి ఆలయాన్ని నిర్మించేందుకు ఒక చారిటబుల్‌ ట్రస్టు ఏడేళ్ల కిందట ముందుకొచి్చంది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేసింది. 

అయితే ఆలయ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఏళ్ల తరబడి ఆలయ నిర్మాణానికి నోచుకోకపోవడంతో వినాయకునికి నిలువ నీడ లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి.. పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టి సారించాలి 
పురాతన కాలం నాటి వినాయకుని ఏకశిలా విగ్రహానికి ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.  – కిరణ్, ఆవంచ, తిమ్మాజిపేట మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)