వైద్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోండి

Published on Sun, 06/23/2024 - 04:35

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, ఇంకా అవసరమైన మేరకు అనుమతులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. 

శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో తెలంగాణ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌(టీఎంఐడీసీ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం), బ్లడ్‌బ్యాంక్‌లు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ యాక్ట్‌ అమలు తదితరాలపై సంబంధిత అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫుడ్‌ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో దేశంలోనే తెలంగాణకు ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు లభిస్తుందన్నారు. 

ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోని వసతి గృహాలు, క్యాంటీన్లతో పాటు అన్ని ఆసుపత్రులలో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్‌ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, నిఘా పెట్టాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలతో పాటు ఆసుపత్రుల్లో ఉన్న క్యాంటీన్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌లు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. 

నాచారంలో ఉన్న ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌ను బలోపేతం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్, ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శివలీల తదితరులు పాల్గొన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)