Breaking News

చావు వస్తుందని తెలిసి.. ముందే ఏర్పాట్లు చేసుకుని..

Published on Thu, 04/06/2023 - 07:25

ఖమ్మం:  ఈరోజుల్లో మనిషికి చావు ఊహించనిది. కానీ, అతనికి మాత్రం ఊహించిందే. అందుకే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. జీవిత భాగస్వామి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసేశాడు. కన్నవాళ్లకు, తోడబుట్టిన వాడికి ధైర్యం చెప్పి.. ఓదారుస్తూ వచ్చాడు. విదేశాల్లో ఉంటున్న తాను.. ఎలాగైనా తన మృతదేహం స్వదేశానికి చేరేలా ముందుగానే ఏర్పాట్లు చేశాడు. ఖమ్మం వాసులను కంటతడి పెట్టిన హర్షవర్థన్‌ గాథలోకి వెళ్తే..  

ఖమ్మం సిటీలో ఉండే ఏపూరి రామారావు, ప్రమీలకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు హర్షవర్థన్‌ బీఫార్మసీ చేసి.. 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పని చేస్తూ వచ్చాడు. కరోనాకి ముందు.. 2020 ఫిబ్రవరిలో ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వస్తే భార్యను తీసుకెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో వైరస్‌-లాక్‌డౌన్‌ వచ్చి పడ్డాయి. 

ఇదిలా ఉండగానే.. 2020 అక్టోబర్‌లో జిమ్‌ చేస్తున్న హర్షవర్ధన్‌కి ఆరోగ్యం తేడాగా అనిపించింది. దగ్గు ఆయాసం అనిపించడంతో టెస్టులు చేయించుకోగా.. లంగ్స్‌ క్యాన్సర్‌ సోకిందని చెప్పారు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. వాళ్లు రోదించారు. ఇంటికి వచ్చేయమని కోరారు. కానీ, హర్ష వాళ్లకు ధైర్యం అందించాడు. అక్కడే ఉండి చికిత్స తీసుకుంటానని  చెప్పాడు. 

క్యాన్సర్‌ సోకింది.. తనకు చావు తప్పదని అనుకున్నాడో ఏమో భార్యకు విడాకులిచ్చేశాడు. అంతేకాదు.. ఆమె జీవితంలో స్థిరపడేందుకు కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో.. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న క్రమంలో.. నయమైందని డాక్టర్లు చెప్పడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 2022 సెప్టెంబర్‌లో ఇంటికి వచ్చి పదిరోజులు ఉన్నాడు. తిరిగి వెళ్లాక.. వ్యాధి తిరగబడింది. ఇక చావు తప్పదని అతనికి అర్థమైంది. విషయం అందరికీ ఫోన్‌ చేసి చెప్పాడు. రోజూ వీడియో కాల్‌లో మాట్లాడడం చేశాడు. ఇంతలో తమ్ముడు అఖిల్‌కు వివాహం నిశ్చయ్యం అయ్యిందని సంతోషించాడు. మే నెలలో ముహూర్తం ఫిక్స్‌ చేయడంతో.. సంతోషించి ఆరోగ్యం సహకరిస్తే వస్తానంటూ చెప్పాడు కూడా. ఆ సమయంలో అతని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

తాను చనిపోయాక.. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంపై అతను దృష్టిసారించారు. ఆ విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనుకున్నాడు. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం.. ఓ లాయర్‌ను పెట్టుకుని ఫార్మాలిటీస్‌ పూర్తి చేశాడు. మార్చి 24వ తేదీన హర్షవర్ధన్‌ కన్నుమూశాడు.  

ఏప్రిల్‌ 5వ తేదీ(బుధవారం) అతని మృతదేహాం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు చేరింది. హర్ష మృతదేహాన్ని చూసి కుటుంబంతో పాటు స్థానికులంతా కన్నీరు మున్నీరుగా విలపించగా..  అంత్యక్రియలు ముగిశాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)