Breaking News

ఇంక్యుబేటర్లకు దన్ను

Published on Sun, 01/12/2025 - 02:40

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడం, వాణిజ్య వాతావరణాన్ని మరింత విస్తరించడం ద్వారా అంతర్జాతీయంగా భారతీయ స్టార్టప్‌లు రాణించేలా ‘టీ హబ్‌’ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ (ఏఐసీ) సహకారంతో టీ హబ్‌ ఫౌండేషన్‌ ‘బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ (బీఐఎంఎల్‌) పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. 

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా వివిధ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ అధిపతులుగా పనిచేస్తున్నవారికి ఇంక్యుబేషన్‌ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణపై శిక్షణ ఇస్తారు. శిక్షణ, వాణిజ్య వ్యాపార సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాంకేతిక, మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం వంటి అంశాల్లో సహకారం అందిస్తారు. 

ఇంక్యుబేషన్‌ వ్యవస్థలో పరివర్తన
బీఐఎంఎల్‌ ద్వారా శిక్షణలో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయిలో ఇంక్యుబేషన్‌ కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మెంటార్లు, కార్పొరేషన్లు, విధాన నిర్ణేతలతో టీ హబ్‌కు ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ ద్వారా భారతీయ ఇంక్యుబేటర్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దే అవకాశాలు మెరుగవుతాయి.

బీఐఎంఎల్‌ కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు ఇప్పటికే టీ హబ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడులోని 15 సాంకేతిక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఎడ్యుటెక్, క్రీడలు, టెక్నాలజీ, మేనేజెమెంట్‌ రంగాల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటును వేగవంతం చేయడమే బీఐఎంఎల్‌ ప్రోగ్రామ్‌ లక్ష్యమని టీ హబ్‌ వర్గాలు వెల్లడించాయి.

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)