Breaking News

రక్షణ రంగంలో సైంటిస్ట్‌ సూరి భగవంతం సేవలు అమోఘం

Published on Thu, 10/17/2024 - 21:29

దేశ రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సైంటిస్ట్‌ డాక్టర్‌ సూరి భగవంతం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సూరి భగవంతం 115వ జయంతి వేడుకలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్ర సేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి మాట్లాడుతూ..‘డాక్టర్ సూరి భాగవతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఖగోళ శాస్త్రం, సముద్ర శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. రక్షణ రంగానికి విశేష సేవలందించారు. సైబర్ నేరాలు, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడం, ఏఐ/ఎంఎల్‌ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు డాక్టర్‌ సూరి భగవంతం అసాధారణ సహకారాలు అందించారని  ప్రశంసల వర్షం​ కురిపించారు.  

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీ వో) మాజీ చైర్మన్‌ డా.జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ సూరి భగవంతం అనేక రక్షణ పరిశోధన రంగాలకు సహకరించారు. చైనా యుద్ధం తర్వాత భారత్‌లో లేహ్, తేజ్‌పూర్‌లో ప్రయోగశాలను, హైదరాబాద్‌లో డీఆర్‌డీఎ్‌ల్‌,ప్రయోగశాలలను స్థాపించారు. రాడార్, బెంగుళూరులోని ఎన్‌ఎస్‌టీఎల్‌లు, అలాగే రక్షణ సాంకేతికతలలో పని చేయడానికి 25 కంటే ఎక్కువ ల్యాబ్‌లను స్థాపించేలా కృషి చేశారు. సంబంధిత పరిశోధనా రంగాలపై దృష్టి సారించడం కోసం ఆ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో నేటి రక్షణ సాంకేతికత, వ్యవస్థల పురోగతికి పునాది వేశారని అన్నారు. డాక్టర్‌ సూరి భగవంతం జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు