Breaking News

రియల్‌ రంగంలోకి ‘సుడా’

Published on Sat, 05/20/2023 - 04:27

సాక్షి, సిద్దిపేట :  రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ‘సుడా’ (సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ) అడుగు పెడుతోంది. గతేడాది డిసెంబర్‌ 9న ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 234 ప్రకా రం సిద్దిపేట పట్టణ శివారులోని మిట్టపల్లి సమీపంలో 14 ఎకరాల అసైన్డ్‌ భూములను సుడా సేకరించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా అసైన్డ్‌ ల్యాండ్‌ పూలింగ్‌తో మోడల్‌ లే అవుట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.

ఓ వైపు పర్యాటకంగా, మరోవైపు సాగు జలాలు, విద్యా కేంద్రంగా విలసిల్లుతోంది. త్వరలో రైలు సౌకర్యం కూడా రానుంది. పట్టణ శివారులో ఇప్పటికే పలు ప్రైవేట్‌ కంపెనీలు వెంచర్లు చేసి విక్రయిస్తున్నాయి. దీంతో భూములకు డిమాండ్‌ పెరిగింది. శనివారం సుడా మోడల్‌ టౌన్‌షిప్‌పై సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ప్రీబిడ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. 

10 మంది రైతులు.. 14 ఎకరాలు
సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో అసైన్డ్‌ భూములు కలిగిన పది మంది రైతుల నుంచి 14 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరం భూమి కోల్పోతున్న రైతుకు డెవలప్‌ మెంట్‌ చేసిన టౌన్‌షిప్‌లో 800 గజాల స్థలం ఇస్తారు. 14 ఎకరాల భూమిలో 67,760 గజాల భూమి తేలింది. ప్రధాన రోడ్డు 60 ఫీట్లు, అంతర్గత రోడ్లు 33 ఫీట్లతో నిర్మా ణాలు చివరి దశలో ఉన్నాయి.

రోడ్లకు 23,907 గజాలు, పార్కులకు 6,098 గజాలు, ఇతర మౌలిక సదుపాయాలకు 2,391 గజాలు వినియోగిస్తున్నారు. దీంతో 35,360 గజాల స్థలం మిగిలింది. దీనిని 161 ప్లాట్లుగా విభజించారు. అందులో 10 మంది రైతులకు 50 ప్లాట్లు, 111 ప్లాట్లు సుడాకు మిగులుతాయి. స్ట్రీట్‌ లైట్‌లు, పార్కులు, మొక్కల పెంపకం,తాగునీటి సౌకర్యం.. ఇలా సకల సౌకర్యాలతో మోడల్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తున్నారు.

 నేడు ప్రీబిడ్‌ మీటింగ్‌
ఈ నెల 29న తొలి విడతలో 101 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ప్రీబిడ్‌ మీటింగ్‌ను శనివారం పట్టణంలోని విపంచి కళానిలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాట్లు కొనుగోలు చేయాలనుకునే వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఒక్కో గజానికి ప్రభుత్వ ధరగా రూ.8 వేలు నిర్ణయించారు. ఆ ధర నుంచి సుడా అధికారులు వేలం ప్రారంభించనున్నారు. ఈ వేలంలో పాల్గొనే వారు దరఖాస్తు ఫీజు కింద రూ.5 వేలు చెల్లించాలి. కాగా, ప్లాట్ల విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో సుడా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపడతారు. 

సకల సౌకర్యాలతో లే అవుట్‌ –రమణాచారి, సుడా వైస్‌ చైర్మన్‌ (19ఎస్‌డీపీ12)
జీఓ 234 ప్రకారం రాష్ట్రంలోనే తొలి సారిగా అసైన్డ్‌ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించాం. వేలంపాట ద్వారా ప్లాటు దక్కించుకున్న వారు వారంరోజుల్లో 25 శాతం డబ్బులు చెల్లించాలి. మిగతా డబ్బులు 60 రోజుల్లో చెల్లించాలి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, విశాలమైన అంతర్గత రోడ్లు, నీటి సరఫరా, పార్కుల వంటి సకల సౌకర్యాలతో మోడల్‌ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ నెల 29న వేలం పాట నిర్వహిస్తాం.

       

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)