Breaking News

నీ కాల్మొక్తా సార్‌.. నా కొడుకు భవిష్యత్‌ కాపాడండి

Published on Thu, 04/06/2023 - 07:31

కారేపల్లి: ‘‘నీ కాల్మొక్తా సార్‌.. నా కొడుకు భవిష్యత్‌ను కాపాడండి.. ఎలాగైనా సరే నా కొడుకు పదో  తరగతి పరీక్ష రాసేలా చేయండి సార్‌’’ అంటూ ఓ తల్లి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కాళ్లపై పడి రోదించింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండాకు చెందిన గుగులోతు రమేష్‌ – సునీత దంపతుల కుమారుడు తరుణ్‌.. గతేడాది కారేపల్లి హైస్కూల్‌లో పదో తరగతి చదివాడు. అయితే గణితంలో ఫెయిల్‌ అయ్యాడు. 

దీంతో, ఈ ఏడాది పరీక్ష రాసేందుకు హైస్కూల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సులోచనకు పరీక్ష ఫీజు రూ.150తో పాటు ఆలస్యమైనందుకు అదనపు రుసుము రూ.వెయ్యి కూడా చెల్లించాడు. అయితే, ఆమె సెలవులో వెళ్తూ హెచ్‌ఎం పవన్‌కుమార్‌కు ఫీజు ఇచ్చినట్లుగా చెబుతోంది. బోర్డుకు మాత్రం ఫీజు అందకపోవడంతో తరుణ్‌కు హాల్‌టికెట్‌ రాలేదు. ఈ విషయమై విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్లో అడగ్గా.. ఎవరికి వారు తమకు సంబంధం లేదని చెబుతూ చివరకు తాము బోర్డుకు ఫీజు చెల్లించలేదని ఒప్పుకున్నారు. ఏం చేయాలో తెలియని తరుణ్‌ తల్లిదండ్రులు బుధవారం కారేపల్లి హైస్కూల్‌కు చేరుకుని హెచ్‌ఎం పవన్‌కుమార్‌ కాళ్లపై పడి రోదిస్తూ ఎలాగైనా తమ కుమారుడి భవిష్యత్‌ను కాపాడాలని వేడుకున్నారు.  

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు