Breaking News

‘కోడ్‌’ ముగిశాక ఆర్టీసీలో సమ్మె

Published on Mon, 02/17/2025 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సంస్థ యాజమాన్యంపై పోరుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఒక కార్మిక జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగి­సిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వాలని మరో జేఏసీ తాజాగా నిర్ణయించింది. మొదటి జేఏసీ నిరవధిక సమ్మెకు మొగ్గు చూపుతుండగా, రెండో జేఏసీ మాత్రం ఐదారు రోజుల­పా­టు సమ్మె చేయాలని భావిస్తోంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసేలోపు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకో­వా­లని, లేనిపక్షంలో సమ్మె అనివార్యమని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. అయితే, కార్మికుల్లో సమ్మెపై ఒకింత భయం కనిపిస్తుండగా, సంఘాల నాయకులు మాత్రం సమ్మెకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. 

ప్రైవేటు సంస్థల పెత్తనంతో..
ఇటీవల ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపె­డు­తోంది. అవన్నీ గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థ నుంచి అద్దెకు తీసుకుంటోంది. ఆ బస్సుల నిర్వహణ కో­సం కొన్ని డిపోలను సదరు సంస్థకు అప్పగించేందుకు ఏర్పా­ట్లు చేయటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

ఇది ఆర్టీసీలో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయటమేనని మండిపడుతున్నారు. దీంతో అధికారులు వెన­క్కు తగ్గి డిపో­ల్లో ఎలక్ట్రిక్‌ బస్సులతోపాటు సాధారణ సొంత బస్సులు కూ­డా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. అయినా ఉద్యోగుల్లో అనుమానాలు తొలగిపోలేదు. ఈ అంశంతోపాటు చాలా కాలంగా పెండింగులో ఉన్న ఇతర సమస్యలను తెరపైకి తెచ్చి కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. 

విలీనం, పీఆర్సీనే ప్రధాన ఎజెండాగా..
గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. అంతలోనే ప్రభుత్వం మార­­టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని పెండింగులో పెట్టింది. 2017 వేతన సవరణ బకా­యిలు కూడా చెల్లించలేదు. 2021 వేతన సవరణపై ప్రభుత్వం స్పందించటంలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దుచేసిన గుర్తింపు యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. సీసీఎస్, పీఎఫ్‌లకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి సాధనే లక్ష్యంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యాయి. 

ఎవరికి వారే..
ఎంప్లాయీస్‌ యూనియన్, టీఎంయూ చీలికవర్గం, బీడబ్ల్యూ­యూ, బీకేయూ, ఎన్‌ఎంయూ చీలిక వర్గం, కేపీ సంఘాలతో కూడిన తొలి జేఏసీ గత నెల 27న యాజమాన్యానికి సమ్మె నో­టీ­సు ఇచ్చింది. ఫిబ్రవరి 3న ఆ యూనియన్ల ప్రతినిధులను కార్మిక శాఖ చర్చలకు పిలిచి, తర్వాత ఎన్నికల కోడ్‌ కారణం చూపి సమావేశం రద్దు చేసింది. దీంతో, ఎన్నికల నోటిఫికేషన్‌ నుంచి ఆర్టీసీ సమ్మెకు మినహాయింపు ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు ఎన్నికల కమిషనర్‌కు విన్నవించారు. 

టీఎంయూ, ఎన్‌ఎంయూ వర్గాలు, బీఎంఎస్, ఎస్‌టీ ఎంయూలతో కూడిన మరో జేఏసీ తదుపరి సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ప్రభు త్వానికి గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. కోడ్‌ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మార్చి 7 వరకు కోడ్‌ అమలులో ఉంటుంది. 

ఐదారు రోజులపాటు సమ్మె చేసి, కొద్ది రోజుల గడువు ఇచ్చి మళ్లీ సమ్మె చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ కార్మికుల్లో 10 వేల మంది మాత్రమే సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)