Breaking News

ఆర్టిజన్ల సమ్మె విరమణ

Published on Thu, 04/27/2023 - 05:32

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సంస్థల్లో ఆర్టిజన్ల సమ్మె ముగిసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల మధ్యవర్తిత్వం వహించడంతో సమ్మెను బేషరతుగా విరమించుకున్నట్టు .. తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(హెచ్‌ 82), ఎంఐఎం అనుబంధ ఇతెహాద్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్లు ప్రకటించాయి.

తమ డిమాండ్ల సాధనకు ఈ రెండు యూనియన్లు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు పిలుపునివ్వగా, విద్యుత్‌ సంస్థలపై పాక్షిక ప్రభావం కనబడింది. సమ్మెలో పాల్గొన్న యూనియన్ల ముఖ్య నేతలతో సహా 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనియన్ల నాయకుల విజ్ఞప్తితో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బుధవారం సీఎండీతో ఫోన్‌లో మాట్లాడారు.  

తొలగించిన ఉద్యోగులను తిరిగి చేర్చుకుంటాం.. 
తొలగించిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని ఒవైసీ కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ ..బేషరతుగా సమ్మె విరమిస్తే 10 రోజుల్లోగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇతేహాద్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అహమద్‌ బలాల రెండు యూనియన్ల నేతలతో కలిసి విద్యుత్‌ సౌధలో ప్రభాకర్‌ రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డిని కలిసి చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా సమ్మెను బేషరతుగా విరమిస్తున్నట్టు హెచ్‌–82 యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.సాయిలు, ఇతెహాద్‌ యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హుసేన్‌లు తెలిపారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు సమానంగా ఆర్టిజన్లకు రూ.16లక్షల గ్రాట్యుటీతో పాటు మెడికల్‌ అన్‌ఫిట్‌ పథకం కింద కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయగా, ప్రభాకర్‌రావు సానుకూలంగా స్పందించారని సాయిలు వెల్లడించారు.

సమ్మె తొలిరోజే 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో బుధవారం రెండోరోజు సమ్మెకు ఆర్టిజన్లు సుముఖత వ్యక్తం చేయలేదని, ఈ కారణంగానే విరమణ ప్రకటన చేయాల్సి వచ్చిందని యూనియన్ల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)